హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు
– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న…