హైడ్రాకు విస్త్రృత అధికారాలు

  • వ‌డ్ల‌కు రూ.500 బోన‌స్ ఇచ్చేందుకు ఆమోదం..
  • రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు..

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : రాష్ట్రంలో నీటివ‌న‌రుల‌ను ర‌క్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు క‌ల్పించాల‌ని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి.. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తూ..

అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న హైడ్రాకు.. విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు వడ్లపై 500 రూపాయల బోనస్ ఇచ్చే అంశంపై కూడా చర్చించిన మంత్రి వర్గం.. సానుకూల నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ ఏడాది నుంచే రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రకటించినట్టుగా.. మూడు యూనివర్సిటీల పేర్లు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కోటి మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా, టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page