- ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..
- హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : దేశ రాజధాని దిల్లీ మాదిరిగా కాకుండా హైదరాబాద్ నగరం కాలుష్యం కోరల్లోకి చిక్కకుండా సోమవారం నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ లో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆదివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు
జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుందన్నారు. సోమవారం నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ లో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చామన్నారు. ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలార్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికిల్, ట్రై గూడ్స్ వెహికిల్, ఎలక్ట్రిక్ వెహికిల్ టాక్స్ లు మినహాయింపు ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు కొంటే , కార్లు ఆర్టీసీ బస్సులు, సంస్థల బస్సులు 100 టాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ లో 83 పఠాన్ చేరు 72 కాలుష్యం ఉందని, కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీ లో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు.
2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ ఉంటుందని, తెలంగాణ ప్రజలు ఈవీ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాహనాలు 15 సంవత్సరాల దాటిన వాటికి స్క్రాప్ చేయాలని పాలసీ తీసుకొచ్చామని,
ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్‌లను ఏర్పాటుచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో 4 రాష్ట్రాలు తిరిగామని, వికాస్ రాజ్,సురేంద్ర మోహన్ లు కలిసి బెస్ట్ పాలసీ తెస్తున్నామని తెలిపారు. వాహన సారథి లో కూడా 29 రాష్ట్రాల్లో తెలంగాణ చేరుతుందని చెప్పారు. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని, దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారని తెలిపారు. రోడ్ సేఫ్టీ పై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. యునిసెఫ్ ద్వారా స్కూల్ లలో రోడ్డు అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని,
రవాణా శాఖకు కొత్త లోగో వొస్తుంది..కొత్త వాహనాలు వొస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఎన్ఫోర్స్ మెంట్ కి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని, రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు.
రేపటి నుండి ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు.. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని చార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి. ఈవి వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వొస్తున్నాయి. వొచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ జీహెచ్ఎంసీ హెచ్ ఎండీఏ,హైదరాబాద్ పోలీస్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖలో అందరికీ ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రవాణా శాఖ లో 58 కానిస్టేబుళ్లు, ఏఎంవీఐలను నియమించామని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.