మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 15 : మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఈ డ్రైవర్ హైదరాబాద్ సర్వీస్ పై డ్రైవింగ్ చేస్తున్నాడు . ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్ లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు.
దీంతో డ్రైవర్ ఆ చిన్నారిని ఆలన పాలన ఇలా చూసుకోవడంతో చూపరులను ఆకట్టుకుంది. చిన్నారి తల్లి తిరిగి రావడంతో మరల ఆ శిశువుని ఆమెకి అప్పగించారు. డ్రైవర్ చేసిన ఈ సహకారం కు అంత హ్యాట్సాఫ్ చెప్పారు.