నేటి నుండి మావోయిస్టు 20వ వార్షికోత్సవాలు

అక్టోబర్‌ 20 వరకు కొనసాగింపు
అడుగడున పోలీస్‌ నిఘా … వాహనాల తనిఖీలు
ఏజన్సీలో మావోయిస్టుల కోసం పోలీస్‌ బలగాల గాలింపు

మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తునందున సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 21 వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీస్‌ అప్రమత్తం అయింది. అడుగడున నిఘా పెంచుతుంది. ఏజన్సీ ప్రాంతాల్లో వాహనాలను విస్తృంతగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను పట్టుకొని విచారిస్తున్నారు. మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపు ఇవ్వడంతో కేంద్ర బలగాలు కూడ అప్రమత్తం అయ్యాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. మావోయిస్టుల వార్షికోత్సవాలను తిప్పికొట్టేందుకు పోలీస్‌ విస్తృతంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా మావోయిస్టు డివిజన్‌ కమిటి లేఖను కూడ విడుదల చేసింది. వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని లేఖ విడుదల చేసింది.

20వ వార్షికోత్సవాలను డివిజన్‌ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో నడుస్తున్న ఆపరేషన్‌ కగార్‌ దాడిని ఓడించండి
మావోయిస్టు పార్టీ ఏర్పడి సెప్టెంబర్‌ 20వ తేదికి 20 సంవత్సరాలు కావస్తునందున రెండు దశాబ్ద కాలంలో శత్రువు తలపెడుతున్న కృారమైన దాడులలో కష్టనష్టాలను ఎదుర్కొని పీడిత ప్రజల విముక్తి కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఎన్నోవిజయవాలు సాధించారని మావోయిస్టు పార్టీ డివిజన్‌ కమిటి కార్యదర్శి వెంకటేష్‌ లేఖ విడుదల చేసారు. ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రజాయుద్ద రంగంలో పోరాడుతున్న టిఎన్‌జిఏ కమాండర్‌లకు విప్లవాభినందనలు తెలిపారు.

సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 20 వరకు గ్రామాల్లో పట్టణాల్లో ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించుకోవాలని లేఖలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మావోయిస్టు పార్టీని విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూళించే లక్ష్యంతో ఎల్‌ఐసి వ్యూహాన్ని ఒక పథకం ప్రకారం చేస్తూనే గ్రీన్‌ హంట్‌ దాడులను కొనసాగిస్తుందని లేఖలో పేర్కోన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో వేలాది అర్ధసైనిక బలగాలను దించి దాడులు చేపిస్తుందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూళించే ప్రతి ఘాటుక పథకాన్ని ఓడిరచడానికి అన్నీ వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని లేఖలో పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page