నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

  • అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది
  •  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు

వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌ జెండా కార్యక్రమం,  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవమంటూ పరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీంతో 48 గంటల పాటు హైదరాబాద్‌ పోలీసులు కంటివిూద కునుకులేకుండా విధులు నిర్వహించాల్సి వొస్తుంది. నిమజ్జనాన్ని ప్రశాంత వాతవారణంలో నిర్వహించడం పోలీసులకు కత్తి విూద సాముగా మారింది. గత ఏడాది మిలాద్‌ ఉన్‌ నబీ, గణెళిశ్‌ నిమజ్జనం ఒకే రోజు వొచ్చినా పోలీస్‌ వ్యవస్థ ముందుచూపుతో వ్యవహారించి రెండు పండుగలు ఒకే రోజు కాకుండా చర్యలు తీసుకున్నది. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఉన్నా.. అదనంగా సెప్టెంబర్‌ 17 వొచ్చింది.

 

కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమాలకు కేంద్రమంత్రులు, బీజేపీ శ్రేణులు హాజరవుతాయి. ప్రజాపాలనకు సీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో అన్ని కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. నిమజ్జనాలు బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలుంటాయి. దీంతో సోమవారం ఉదయం పోలీసుల పహారా మొదలైంది.  బుధవారం ఉదయం వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే మధ్యాహ్నం ఒంటిగట్ట వరకు నిమజ్జనం పూర్తి చేయాలని నగర పోలీస్‌ కమిషన్‌ సివి ఆనంద్‌ అన్నారు.

ఇక 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. 17న నిమజ్జనంతో పాటు పబ్లిక్‌ గార్డెన్స్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించటానికి సంసిద్దం అయ్యారు. క్రిటికల్‌ జంక్షన్స్‌, క్రాస్‌రోడ్స్‌, బషీర్‌బాగ్‌ చౌరస్తా, ఎంజే మార్కెట్‌లో చాలా కీలకం. చెకింగ్స్‌, సోషల్‌విూడియా మానిటరింగ్‌, షీ టీమ్స్‌ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి. డ్రోన్‌ కెమెరాలు, మౌంటెడ్‌ కెమెరాలు, కెమెరా మౌంటెడ్‌ వాహనాలను ఏర్పాటుచేస్తున్నాం అని సివి ఆనంద్‌ వివరించారు.18వేలమంది పోలీసులను బందోబస్తుకి వినియోగిస్తున్నట్టు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. అన్ని జోన్‌ ల డీసీపీలు, స్టేషన్‌ ఆఫీసర్లు, పెట్రోలింగ్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బందితో కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, గొడవలు చెలరేగకుండా చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్‌ కూడా గణేష్  నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇతర అధికారులతో కలసి ఆయన హైదరాబాద్‌ లోని ముఖ్యమైన మండపాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. నిమజ్జనం రోజు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలని చెప్పారు. పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ కాదు, ఇతర విభాగాలు కూడా నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.

 

నిమజ్జనోత్సవానికి వొచ్చే ప్రజలు, నిమజ్జనం తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేవారి కోసం 600 స్పెషల్‌ సర్వీస్‌ లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. ఇక రైల్వే కూడా రాత్రి వేళల్లో ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమైంది. అటు మెట్రో సర్వీస్‌ ల సమయం కూడా పొడిగించారు. 70 అడుగుల ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ట్రాలీ తీసుకొచ్చి విగ్రహాన్ని దానిపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. అర్థరాత్రితో ఖైరతాబాద్‌ లో దర్శనాలు నిలిపివేశారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వాహకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page