అసంఘటిత కార్మిక శక్తి..

ఒక ఉద్యమం పుట్టింది. అది మధ్యప్రదేశ్‌ లోని ఛత్తీస్‌ ఘడ్‌ ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌ గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌ పూర్‌, దుర్గ్‌, రాజ్‌ నంద్‌ గావ్‌, సర్గుజా, బిలాస్‌ పూర్‌, రాయ్‌ గఢ్‌, బస్తర్‌ ప్రాంతాలు ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, డోలమైట్‌, అనేక ఇతర నిక్షేపాలకు ప్రసిద్దిగా పేరుగాంచాయి. 1959 నెహ్రూ ప్రభుత్వం దుర్గ్‌ జిల్లాలోని భిలాయ్‌ లో సోవియట్‌ యూనియన్‌ సహకారంతో ప్రభుత్వ రంగంలో భిలాయ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఆ ఫ్యాక్టరీ దేశంలోనే ఉక్కు ఉత్పత్తిలో అతిపెద్ద కర్మా గారంగా రూపాంతరం చెందింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం డార్జిలింగ్‌ సమీపంలోని జూల్ప యిగురిలో 1942 సెప్టెంబర్‌ 18న జన్మించిన శంకర్‌ గుహ నియోగి వారి కుటుంబంలో పెద్దవాడు. తండ్రి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నియోగి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే బంధువుల ఇంటికి వచ్చి భిలాయ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం పొంది బ్లాస్ట్‌ అండ్‌ ఫర్నేన్స్‌ యాక్షన్‌ కమిటీ అనే కార్మిక సంఘాన్ని స్థాపించి సమరశీలమైన పోరాటాలు సమ్మెలు చేయడం ప్రారంభించారు కార్మికులకు ఏకం చేసి. అధిక వెట్టిచాకిరి, చాలీచాలని జీతాల నడుమ చిన్నాభిన్నం అయి బ్రతుకీడుస్తున్న కార్మికులందరి చేత మద్యపానానికి వ్యతిరేకంగా నియోగి ప్రమాణం చేయించడంతో అక్కడ సంపూర్ణ మద్య నిషేధం జరిగింది. ముఖ్యమంత్రి అర్జున్‌ సింగ్‌ హయాంలో పారిశ్రామిక ప్రాంతంలో మద్య నిషేధం అమలవడంతో ప్రభుత్వానికి కంటగింపుగా నియోగి మారారు. ఇదే క్రమంలో ఛత్తీస్‌ గఢ్‌ ముక్తి మార్చ్‌ ఉద్యమం ప్రారంభం కావడం అది ధవణంలా వ్యాపించడం జరిగిపోయింది.

సంఘటిత అసంఘటిత కార్మికుల నడుమ ఉన్న అంతులేని అంతర్యాలు అర్థం చేసుకొని వారందరినీ ఒకటిగా చేయడం మొదలు కార్మికులు సమ్మె చేసే క్రమంలో జీతభత్యాలు లేక కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటించవద్దని సమీప గ్రామాల రైతుల నుండి కార్మికుల కుటుంబాలకు కాయకురగాయలు, బియ్యం, అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తిండి గింజలకు కొదవ లేని కార్మికుల తమ పోరాటం నిర్విరామంగా కొనసాగించడం గొప్ప చరిత్ర. ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్‌ అయి 13 నెలలు జైలు జీవితం అనుభవించిన ఆయన తన జీవితంలో 26 సార్లకు పైగా జైల్లో ఉన్నారు. ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన షాహిద్‌ వీర్‌ నారాయణ సింగ్‌ పేరుతో పాటుగా, తమ హక్కుల కోసం జరిగిన పోరాటంలో పోలీస్‌ కాల్పుల్లో అమరులైన అమాయకులైన ఆదివాసీ కార్మికులు, బాల నాట్య కళాకారుల పేరిట రోగిని ప్రేమించి రూపాయిని ద్వేషించి షాహీద్‌ ఆసుపత్రిని నిర్మించి ప్రజలందరికీ ఉచిత సేవలు అందించారు. అది ఇప్పటికి వైద్యులు సైబల్‌ నేతృత్వంలో స్వచ్ఛందంగా సేవలందించడం విశేషం. ధనిక భూస్వామి, కాడు పేద ప్రజలకు నిలయమైన ఛత్తీస్గఢ్‌ లో ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై స్వార్థ ప్రయోజనాలే ఆధిపత్యం కొనసాగాయి. ఈ ప్రాంతంలోని సహజ వనరులను దోపిడీ చేయడంలో పారిశ్రామికవేత్తలది పైచేయి కాగా సాధారణ ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన నియోగిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు.

ిిిికార్మికులను దోచుకున్న పారిశ్రామిక వేత్తలను ఎదిరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందు వరుసలో నిలిచి అనేక కేసులు, జైలు జీవితం గడిపారు. చివరకు తనను హత్య చేయచూస్తున్నారని రాష్ట్రపతికి నేరుగా నియోగి ఫిర్యాదు చేసిన స్థానిక అధికార యంత్రాంగం ఎటువంటి రక్షణ కల్పించలేదు. దీంతో 1991 సెప్టెంబర్‌ 28న తన ఇంట్లో నిద్రిస్తున్న నియోగిని కిరాయి హంతకుడు ప్లాటిన్‌ కాల్చి చంపించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ హత్య కేసును కార్మికుల డిమాండ్లతో కేంద్రం సీబీఐకి అప్పగించడంతో సెషన్స్‌ కోర్టు 1997లో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, కిరాయి హంతకుడికి మరణ శిక్ష ఖరారు చేయగా నిందితులు క్రింద కోర్ట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. 1998 కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో ఆ తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ కిరాయి హంతకుడికి ప్లాటిన్‌ కు మరణ శిక్షకు బదులుగా యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ మిగిలిన వారిని విడుదల చేసింది ధర్మాసనం.

కార్మిక సంఘం నాయకుడి హత్య కేసులో రాష్ట్ర పోలీసులు, సీబీఐ కలిసి దర్యాప్తు చేయడం దేశ చరిత్రలో మొట్టమొదటి కేసుగా నిలిచిపోయింది. నియోగి కేసుకు ముందు సింగరేణి నల్ల నేల మందమర్రిలో జరిగిన కార్మిక గుండెచప్పుడు వీటి అబ్రహం హత్య కేసు సైతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది, అనంతరం తమ ఉనికి చాటుకొనే లక్ష్యంతో పీపుల్స్‌ వార్‌ వంటి గ్రూపులు రాధాకృష్ణ, నర్సయ్య వంటి పలువురు కార్మిక సంఘం నాయకులను హత్యలు చేసి కోల్‌ బెల్ట్‌ లో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఛత్రీస్‌ గఢ్‌ ముక్తి మార్చ్‌ తో అసంఘటిత కార్మికులను సంఘటిత పరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అసువులు బాసిన కార్మిక నాయకులుతో కార్మికులు, శ్రామికుల కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారు కార్మికల గుండెల్లో చిరస్థాయిగా పదిలంగా ఉంటారు.

(నేడు శంకర్‌ గుహ నియోగి వర్ధంతి..
రివాల్యూషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు..)
-అనిల్‌ భగత్‌, జర్నలిస్ట్‌, 94917 43506

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page