పార్టీ కోసం శ్రమించిన సమర్థుడికే టీపీసీసీ పీఠం

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌కు ఘన ఘన సన్మానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కు పార్టీ అధిష్ఠానం టీపీసీసీ పీఠాన్ని అప్పగించడం హర్షణీయమని   రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌  ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కి మాజీ ఎంపీ  వి.హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ఎన్‌ఎస్‌ ‌యూఐ  రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను కరీంనగర్‌ ఎన్‌ఎస్‌ ‌యూఐ  అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు.  మహేష్‌ ‌కుమార్‌ ‌తనకంటే ఎక్కువ శ్రమ పడ్డారని తెలిపారు. తాము వారసత్వ రాజకీయాల నుంచి కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుంచి జెండా పట్టుకొని పైకి వచ్చామన్నారు. రాహుల్‌ ‌గాంధీ సూచన మేరకు  కులగణన చేసి తీరుతామని అన్నారు.

దీనివల్ల  రాబోయే తరాలలో బలహీన వర్గాలు,  ఎస్సీ,  ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బలహీన వర్గాల మంత్రిగా కులగణనకు సంబంధించి అసెంబ్లీ లో బిల్లు పెట్టుకొని నిధులు కేటాయించామని చెప్పారు. బీసీ కమిషన్‌ ఏర్పడిన వారం రోజుల్లోనే కులగణనపై కమిటీ వేశామన్నారు. రాబోయే కాలంలో బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్‌ ‌ల ప్రక్రియలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీసీ ల ప్రాధాన్యం ఉండాలన్నారు. రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పార్టీలో,  మేము ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఎస్సి, ఎస్టీ, బీసీ లకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, విద్యార్థి స్థాయి నుంచి వొచ్చి ఎన్ని కష్టాలు వొచ్చినా పార్టీని వదులుకోలేదని తెలిపారు.  10 సంవత్సరాలుగా బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ అంశాలను బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు.  కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు అమీర్‌ అలీఖాన్‌, ఎగ్గే మల్లేశం , ఎమ్మెల్యేలు వినోద్‌ , ‌వీర్లపల్లి శంకర్‌ , ‌మక్కాన్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌ , ‌వ్యవసాయ శాఖ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కోదండ రెడ్డి , కార్పొరేషన్‌ ‌చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి , ఈరవత్రి అనిల్‌, ‌శివసేన రెడ్డి, ప్రీతం, మెట్టు సాయి కుమార్‌, ‌కాల్వ సుజాత, చల్లా నరసింహా రెడ్డి , మత్తినేని వీరయ్య, ఖైరతాబాద్‌ ‌డిసిసి అధ్యక్షులు రోహిన్‌ ‌రెడ్డి,బీసీ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మాజీ మంత్రి శంకర్‌ ‌రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page