అరికెపూడిని ఎలా నియమిస్తారు..

  • పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా
  • స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల

ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని ఎన్నుకున్నారా.. సెలక్షన్‌ చేశారా అని అడిగామన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి , గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ…రూల్‌ 250 ప్రకారం పీఏసీ కమిటీని ఎన్నుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలం కోరామని అన్నారు.

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌ పేర్లు, మండలి నుంచి ఎల్‌ రమణ, సత్యవతి రాథోడ్‌ పేర్లు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఇచ్చామని చెప్పారు. కానీ హరీష్‌రావు పేరు లేకుండా అరికపూడి గాంధీ ఎలా వొచ్చిందని ప్రశ్నించారు.పీఏసీ చైర్మన్‌ను ప్రతిపక్ష పార్టీ నియమిస్తుందని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీలకే పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలోఉన్న నేతలే పీఏసీ చైర్మన్లు అయ్యారని వివరించారు. కేంద్రంలో కూడా ఇదే ఫార్ములా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలకే పీఏసీ చైర్మన్‌గా చేశారని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచన మేరకే లోక్‌సభలో కేసీ వేణుగోపాల్‌ పీఏసీ చైర్మన్‌ అయ్యారని గుర్తుచేశారు.

పీఏసీ నియామకంపై స్పీకర్‌ను అడిగితే ఆయన ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్నింటికీ మంత్రి శ్రీధర్‌ బాబు సమాధానం ఎలా చెబుతారని నిలదీశారు. పీఏసీ నియామకంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపామని చెప్పారు. తెలంగాణ ప్రజలు, మేధావులు కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి ఆలోచించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్‌ కోసం నామినేషన్‌ వేయలేదని.. ఆయనను ఎలా చైర్మన్‌గా నియమిస్తారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. హరీష్‌ రావును ఎందుకు లిస్ట్‌లో లేకుండా చేశారని నిలదీశారు. హరీష్‌ రావు అంటే అధికార పార్టీకి భయమా అని అడిగారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ… ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఇచ్చామని గుర్తుచేశారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చాలా కీలకమని చెప్పారు. తాము అన్ని గమనిస్తామన్నారు. ఈ విషయంపై తెలంగాణ హై కోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్‌ను కలుద్దామని చూస్తే ఆయన వెళ్లిపోయారని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ నేతలకు కూడా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శలు చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్‌ నేతలే పంచుతున్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page