అం‌దుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
  • పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 4 : హైదరాబాద్‌ ‌నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్‌ ‌పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం ప్రారంభించారు. తెలంగాణ స్టేట్‌ ‌పోలీస్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ అం‌డ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పూజలు చేసి ప్రారంభించారు. వేదపండితుల పూజల మధ్య సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తరవాత వివిద మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేశారు. అంతకు ముందు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్‌ ‌హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కోలేటి దామోదర్‌, ‌సీపీ సీవీ ఆనంద్‌, ‌పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే తన ఛాంబర్‌లో సీపీ సీవీ ఆనంద్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆం‌క్షలు అమల్లో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్‌ ‌చేస్తూ.. రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 టర్లు. టవర్‌ ఏ ‌లోని 18వ ప్లోర్‌లో హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయం ఉంది. 14, 15వ ప్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్‌ ‌బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు.

బిల్డింగ్‌ ‌చుట్టూ 35 శాతం గ్రీనరీ, 600 వాహనాలు పార్కింగ్‌ ‌చేసుకునేలా ఏర్పాటు చేశారు. ప్లోర్‌ ‌ప్లోర్‌కు సోలార్‌ ‌ప్లాంటు ఉంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానం చేశారు. నగర వ్యాప్తంగా సీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్‌ ‌సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. నగర కమిషనరేట్‌ ‌పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్‌, ‌టాస్క్‌ఫోర్స్, ‌స్పెషల్‌ ‌బ్రాంచ్‌.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ ‌విండో విధానం అమలుకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page