పరిగి నియోజక వర్గ ముదిరాజు లు పెద్ద ఎత్తున తరలి రావాలి
పరిగి పట్టణంలో ముదిరాజ్ భవనంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు
పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న పండగల సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమము పరిగి నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దోమ రామచంద్రయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి డి. కృష్ణ ముదిరాజ్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ముదిరాజ్, పరిగి వైస్ ఎంపీపీ కె. సత్యనారాయణ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలముకుందం ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాణిక్యం ముదిరాజ్ లు తెలిపారు. ఆదివారం పరిగి పట్టణంలోని నాయికొటివాడ ముదిరాజ్ భవన ఆవరణలో పరిగి నియోజక వర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముదిరాజు లు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముదిరాజ్ ల హక్కులు, డిమాండ్లు, సమస్యలు పరిష్కారం కొసం ఎకతాటి పైకి వచ్చి ఫోరాటం చేయాలన్నారు.బడుగు బలహీనర్గాలకు ఆదర్శంగా నిలిచిన పండుగ సాయన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వారు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పరిగి నియోజక వర్గ పరిధిలోని ముదిరాజులు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వివిధ పార్టీలలో ఉన్న పలువురు ముదిరాజ్ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ముదిరాజ్ సంఘ నాయకులు, పెద్దలు మోత్కూర్ సర్పంచ్ కేశవులు ముదిరాజ్, ఖుదావంధ్ పూర్ మాజీ సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, ముదిరాజ్, మండల అధ్యక్షులు అనంతయ్య ముదిరాజ్, యువజన సంఘాల అధ్యక్షులు పర్షమోని బాబు ముదిరాజ్, దోమ శ్రీశైలం ముదిరాజ్, ముకుంద నాగేశ్వర్ ముకుంద శేఖర్, జనార్ధన్, కామునిపల్లి రఘు, సత్యనారాయణ, శ్రీశైలం, రమేష్ సంతోష్, వంశి, శ్రీనివాస్, యాదయ్య, అల్లాడి బందెయ్య, తేజ, వంశీ, నవీన్, చంద్రయ్య ,వెంకటేష్ ,అశోక్ కుమార్, కిష్టయ్య, నరసింహులు, శ్రీనివాస్, జంగయ్య, పాండురంగం, రవి, శ్రీశైలం, అనిల్ కుమార్, రాఘవేందర్, రమేష్ కుమార్, సత్యనారాయణ, ఆనంద్, గోపాల్, హనుమంతు ,నరసింహులు, జనార్ధన్, పవన్ కుమార్, నారాయణ, శ్రీనివాస్, రాములు, రమేష్ ,శంకరయ్య, ఆంజనేయులు, అనంతయ్య, దామోదర్, పాండు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.