అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్

గజ్వేల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా బ్రతకాలన్నదే కేసిఆర్ లక్ష్యం కాగా , పేద ప్రజల సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన గజ్వేల్ లో  విలేఖరులతో మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా , అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ సకలజనుల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు . సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం చేపట్టగానే ప్రతి ఇంటికి రూ 5 లక్షల బీమా వర్తింపజేయనుoడగా , తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు . అలాగే ప్రతి ఒక్కరికి రూ 15 లక్షల ఆరోగ్య భీమా అందనుoదని , అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు . ఆసరా పెన్షన్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రూ 3016 ఇవ్వనుండగా , దశలవారీగా రూ 5016 పెంచనున్నట్లు పేర్కొన్నారు .  ప్రతి దివ్యాంగుడికి రూ 6 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు . అగ్రవర్ణ పేదలకు సైతం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యా బోధన అందించనున్నట్లు స్పష్టం చేశారు . పేద కుటుంబాల మహిళలకు సౌభాగ్యలక్ష్మీ పథకం కింద రూ 3 వేల జీవనభృతి ఇవ్వనుండగా, రూ 400కే వంట గ్యాస్ అందించనున్నట్లు చెప్పారు . గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు నిర్మించనుండగా , పేదలు గౌరవప్రదంగా , ఆర్థికంగా తలెత్తుకునేలా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page