అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

  • మొత్తంగా ఇచ్చిన హామీలను
  • అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా కలసి నడుస్తున్నారు. అభివృద్ది సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతున్నారు. రైతురణమాఫీ కీలక అడుగుగా భావించాలి. లక్ష వరకు రుణాలకు  ఖాతాల్లో జమ అయ్యాయి.  కెసిఆర్‌ ప్రభుత్వం గతంలో ఇచ్చిన రుణమావిరీ నెరవేరలేదు. పదేళ్ల పాటు డొల్ల మాటలతో, మసిపూసి మారేడుకాయ చేశారు. అయినా ఒక్కో అవినీతి బయటపడుతున్న కొద్దీ కాంగ్రెస్‌పై ఎదురుదాడి తో తమ అవినీతి, అక్రమాలను, బంధుప్రీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏపని చేసినా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇకపోతే రుణమాఫీకి స్పష్టమైన విధానాలు ప్రకటించారు. రతుభరోసా విషయంలో కూడా స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతున్నారు. రైతురుణ మాఫీ విషయంలో ఇచ్చిన హావిరీని నిలబెట్టుకుంటున్న సిఎంగా రేవంత్‌ ముందుంటారు. అందులోనూ అర్ములకే రుణమాఫీ ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయం.

పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్‌ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడిరచారు. . కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న రూ.లక్ష లోపు తొలుత రుణాలు మాపీ చేశారు.  రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.  రుణమాఫీ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాల ను విడుదల చేసింది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రావిరీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యూవల్కెన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని… రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

అయితే తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించటంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రేషన్‌ కార్డు లేని వారికి ఆధార్‌ కార్డు ప్రమాణికంగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. అయితే.. రుణమాఫీ మార్గదర్శ కాల విడుదల అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇదేంటంటూ అటు బీఆర్‌ఎస్‌ ..ఇటు బీజేపీ .. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి.. రైతులను రెచ్చగొడు తున్నాయని.. అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రుణమాఫీకి రేషన్‌ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్లారిటీ సైతం క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్‌ బుక్‌ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్‌ కార్డు నిబంధన పెట్టామన్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడిరచింది. ఇదిలావుంటే రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆంక్షల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని.. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం సరికాదంటూ పేర్కొంది. షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని  డిమాండ్‌ చేశారు.

మొత్తంగా రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని.. పీఎం కిసాన్‌ నిబంధనలు వర్తింపుతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్‌ రూల్స్‌తో సగం మంది రైతులకే మాఫీ జరుగుతుందన్నారు. రైతుల సంఖ్యను కుదించడమే.. ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.   బిఆర్‌ఎస్‌ లాగా డంబాచారాలకు పోవడం లేదు. అదేపనిగా ప్రచారాంతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు సాగడం లేదు. ఈక్రమంలో  బిఆర్‌ఎస్‌ డొల్ల బయటపడడంతో ఎమ్మెల్యేలు కూడా ఇక పార్టీలో ఉండి లాభం లేదన్న రీతిలొఓ ఆలోచన చేస్తున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ తట్టుకోలేక పోతున్నది. ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపిలను కూడా బిజెపికి అప్పగించే పనిలో బిఆర్‌ఎస్‌ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటు న్నాయి. అవసరాల కోసం బిఆర్‌ఎస్‌ ఏమైనా చేస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు.

ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్‌ చేరికలతో కళకళలాడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పార్టీకి ఎనలేని జోష్‌ వచ్చింది.. మునుపటిలా కొట్లాటల్లేవ్‌.. నేతలంతా ఒక్కట్కె కలిసిమెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను,బిఆర్‌ఎస్‌ను ఎదగకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలను,ఎమ్మెల్యేలను  చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే చేరికలతో జగిత్యాల నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కొంత బెట్టుసరి ప్రదర్శించారు. నిజంగానే కాంగ్రెస్‌కు గుడ్‌ బ్కె చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం సాగింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతో పాటు కేసీ. వేణుగోపాల్‌ను కూడా కలిసి.. చర్చించారు. అంతేకాదు.. మునుపటితో పోలిస్తే కాంగ్రెస్‌కు చాలా గ్రాఫ్‌ పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఆశ్చర్యపడేలా చేరికలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు.

ఇప్పటికైతే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తగ్గాయ్‌.. అసంతృప్తులు కూడా తగ్గారు.. ఇక చేరికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది..? పార్టీలో ఉన్న సీనియర్లు, సిట్టింగ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనేది వేచి చూడాల్సిందే మరి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మరింతగా వివక్షకు గురయ్యిందని, ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి  తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం చెప్పుకుంటున్నారు. దీనిని జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్‌, బిజెపి  నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఉనికి కోసం  విపక్షాలు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని తెలిపారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధిపొందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవు తున్నాయన్నారు.
  -సి.వి.భరద్వాజ్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page