ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వానికి,పరిపాలనకు అధికారులు వారధిలాంటివారని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అర్హులకు అందజేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుందన్నారు.ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని,అర్హులకు ప్రభుత్వం అందేలా చూడాలన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీఓ హిమబిందు,ఏడి స్వామి,చేవెళ్ల సిఐ వీరబ్రహ్మం,పిడబ్ల్యుఎస్ఎస్ ఏఈ గీత స్రవంతి,ఉప సర్పంచ్ గంగి యాదయ్య,మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్,వార్డు సభ్యులు కాసుల షీలా,చేగూరి మాలతి మల్లారెడ్డి,దేవులపల్లి శ్రీనివాస్ రెడ్డి,గజ్జల యాదమ్మ, జంగన్నోళ్ల హరికృష్ణ,మల్గారి మల్లారెడ్డి,కావడి యాదమ్మ,జుక్కన్న గారి స్వాతి శ్రీకాంత్ రెడ్డి,బ్యాగరీ స్వరూప శ్రీనివాస్,ఈరముల్లా మల్లేష్, హౌసుల శోభ,మహమ్మద్ గయాసుద్దీన్,ఆప్షన్ సభ్యులు పాటి దామోదర్ రెడ్డి,చాకలి నారాయణ,హౌసుల పుష్పలత,నాయకులు బ్యాగరీ రాములు,మధ్యల శ్రీనివాస్,అంగన్వాడి టీచర్స్,ఆశా వర్కర్స్,పంచాయితీ సెక్రెటరీ,గ్రామపంచాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.