- 2026 జనాభా లెక్కల తరవాతనే ఆలోచిస్తాం
- రాజ్యసభలో జివిఎల్ ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్ సమాధాన
- తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు
న్యూ దిల్లీ, జూలై 27 : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో కుదిరేలా లేదు. దీనికోసం సుదీర్ఘంగా వేచిచూడక తప్పదని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో జవాబు ఇచ్చారు. ఇప్పట్లో కాదు 2026 నాటికే అప్పటి నూతన జనాభా లెక్కల ప్రకారం ఉంటుంది అని తేల్చేశారు. అంటే 2023లో తెలంగాణాలో 2024లో ఏపీలో జరిగే ఎన్నికలలో పాత సీట్లతోనే పోటీకి దిగాలన్న మాట. ఒక విధంగా ఇది టీఆర్‌ఎస్, వైసీపీలకు రాజకీయంగా షాక్ అని చెప్పాలి.
అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే..రాజ్యాంగ సవరణ అవసరం అని తేల్చింది. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి..ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగవని తేలిపోయింది. అసలు మా దగ్గర ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేనే లేదని తేల్చేసింది. ఇలా రెండు రాష్ట్రాల ఆశలవి•ద కేంద్రం నీళ్ళు జల్లింది. నిజానికి విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం చూస్తే 2014లోని సెక్షన్ 26 (1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనల మేరకు సెక్షన్ 15 మేరకు ఆంధప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా 225, 153 లకు పెరుగుతాయి.
అయితే దీని విద గత ఎనిమిదేళ్ళుగా కేంద్రం ఊరిస్తూనే ఉంది. నిజానికి దీన్ని చేయడానికి కేంద్రానికి పైసా కూడా ఖర్చు ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు రాజకీయ లాభం కలుగుతుంది. పెద్ద ఎత్తున సీట్లు పెరిగితే ఆశావహులకు అందరికీ వాటిని సర్దుకుని మళ్లీ తెలంగాణా, ఏపీలలో ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వొచ్చే వీలు ఉంటుంది. మరో వైపు చూస్తే ఆనాడు చంద్రబాబు, కేసీఆర్ సీట్ల పెంపు వి•ద చాలానే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పుడు కూడా కుదరలేదు. ఇపుడు చూస్తే జగన్ దీని వి•ద వత్తిడి తేకపోయినా సీట్లు పెరిగితే లాభమే అని అంచనా వేసుకున్నారు.