న్యూజెర్సీలో సభ ఏర్పాట్లపై సమీక్ష
ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన (Revanth New Jersey Tour)లో భాగంగా ఆగస్ట్ 4వ తేదీన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని నిర్వాహక బృందం ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించింది.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను సమీకరించే నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు రానున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బహుళ జాతి కంపెనీల సీఈవోలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు.