ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్‌

  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌
  • ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి

నెల్లూరు, జూన్‌ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్‌ ‌జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్‌ ‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ ‌కుమార్‌ ‌నా తెలిపారు. ఆత్మకూరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఓటర్‌కార్డుకు ఆధార అనుసంధానం తప్పనిసరి కాదన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కానీ విధివిధానలు పూర్తిస్థాయిలో రావాల్సి ఉందన్నారు. ఆత్మకూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్‌ ‌చక్రధరబాబు బుధవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ‌డియాతో మాట్లాడుతూ… సాయంత్రానికి సిబ్బంది పోలింగ్‌ ‌కేంద్రాలకు చేరుకొంటారని తెలిపారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని… కోవిడ్‌ ‌జాగ్రత్తలు కూడా తీసుకొంటున్నామన్నారు. ప్రతీ బూత్‌ ‌వద్ద మెడికల్‌ ‌టీం ఉంటుందని చెప్పారు.

ప్రశాంత పోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్‌ ‌చక్రధరబాబు కోరారు. మరోవైపు ఆత్మకూరు ఉపఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు తెలిపారు. బుధవారం డియాతో మాట్లాడుతూ.. 38 సెక్టార్లకు రూట్‌ ‌మొబైల్‌ ‌టీంలు ఉంటాయని, మండలానికో స్టైక్రింగ్‌ ‌ఫోర్స్ ‌తిరుగుతుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ ‌స్టేషన్‌ల వద్ద సాయుధ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. బాడీ ఓన్‌ ‌కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. అన్ని చెక్‌ ‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని అన్నారు. ఇప్పటి వరకూ రూ.47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విజయరావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page