ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల అవగాహన కల్పించాలి

  • భయం లేకుండా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి
  • కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌

‌భద్రాచలం,మే 28(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఆదివాసీ గిరిజన గ్రామాలలో ప్రభుత్వ హాస్పిటల్‌లో చేసే వైద్యం గురించి గిరిజనులకు ప్రత్యేక అవగాహన కల్పించి వారికి వైద్యం పట్ల భయం లేకుండా చూడాలని కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ అన్నారు. శనివారం భద్రాచలం లోని ఏరియా హాస్పిటల్‌ని భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌మరియు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పోట్రూ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్‌లోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులకు, గర్భిణీ స్త్రీలకు, రక్తహీనత చిన్నారులకు అందిస్తున్న వైద్యం గురించి హాస్పిటల్‌ ‌పర్యవేక్షకుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన వైద్యులకు పలు సూచనలు ఇస్తూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, హాస్పిటల్‌లో సాధారణ ప్రసవాలు ఎక్కువశాతం జరిగేలా సిబ్బంది ఆదివాసి గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. న్యూట్రిషన్‌ ‌వార్డులో చిన్న పిల్లలకే కాక తల్లులకు కూడా ప్రత్యేకమైన పౌష్టికాహారం అందించాలని ఆయన అన్నారు.

అనంతరం ప్రసూతి వార్డు పరిశీలించి ప్రసవాలకు వొచ్చే గర్భిణీ స్త్రీలకు సరైన వైద్య సౌకర్యం అందించాలని అలాగే మాత శిశు మరణాలు జరగకుండా చూడాలని ఆయన సంబంధిత గైనకాలజిస్ట్ ‌లకు సూచించారు. అలాగే పుట్టిన బిడ్డకు రెండు ఏళ్ళు వొచ్చే వరకు ఆరోగ్య పరిరక్షణ కొనసాగేలా ప్రాధాన్యత కల్పించాలని, చిన్నారులకు మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్‌ ‌శాతాన్ని పరీక్షించేలా చూడాలని, హైరిస్క్  ఉన్న గర్భిణీలు అంచనా ప్రసవ తేదీ ముందే హాస్పిటళ్లకు వొచ్చేలా ఆదివాసి గిరిజనులకు అవగాహన కల్పించి హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యేలా చూస్తే మాతా శిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గించవచ్చని ఆయన అన్నారు. ఎక్కువ శాతం ఆదివాసీ గిరిజనులు ప్రభుత్వ హాస్పిటల్‌కి వొచ్చేలా చూడాలని, ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ల వైపు మొగ్గు చూపకుండా సంబంధిత వైద్య సిబ్బంది వారి పరిధిలోని గిరిజన కుటుంబాలకు అవగాహన కల్పించాలన్నారు. భ••ద్రాచలంలోని ఏరియా హాస్పిటల్‌కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని హాస్పిటల్‌కి ఎటువంటి సౌకర్యాలను అయినా కేంద్రం ద్వారా తప్పకుండా వొచ్చేలా చూస్తామని ఆయన అన్నారు.

గిరిజనులకు సేవ చేస్తున్న ప్రభుత్వ హాస్పిటళ్లే కాక అంగన్‌ ‌వాడి కేంద్రాలు చేస్తున్న సేవలను ఆయన అభినందించి ముందు ముందు ఇంకా ఏమైనా గిరిజనుల వైద్యం కోసం కానీ, వారి యొక్క అభ్యున్నతికి అవసరమైన నిధులను తప్పకుండా కేంద్రం నుండి పంపిస్తామని అన్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్‌లోని ప్రతి వార్డు అల్ట్రాసౌండ్‌ ‌క్యానింగ్‌ ‌గది, ప్రత్యేక నవజాత శిశువు చికిత్స కేంద్రం, డయాలసిస్‌ ‌సెంటర్‌లను పరిశీలించి ఇక్కడ అందిస్తున్న వైద్య సౌకర్యాలను సంబంధిత రోగులను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్‌ ‌పర్యవేక్షకుడు రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి దయానంద్‌, ‌డాక్టర్లు పూజ సుమన్‌, ‌విజయ్‌, ‌వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page