ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని
దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌

అభాగ్యుల అక్కర పెట్టుబడిగా
అందినంత కొల్లగొడుతున్నయ్‌

‌తొలుత హామీల నిమిత్తంలేక
రుణం ఇస్తామని నమ్మబలికి
తదుపరి విషం చిమ్ముతున్నయ్‌

‌బాకీలు రాబట్టుకునే పనిలో
పరువు తీయడమే కాకుండా
ప్రాణాలను బలిగొంటున్నయ్‌

‌వారం రోజులు గడువు ఇచ్చి
ఆలోగా చెల్లించలేని వారిపట్ల
బూతు దండకం నోటికెత్తుకొని
వేధింపులకు తెగబడుతున్నయ్‌

ఇది చాలదన్నట్లు పోటోలను
అసభ్యకరంగా మార్ఫింగ్‌ ‌చేసి
బంధుమిత్రులకు చేరవేయటం
నిర్వాహకుల నీచానికి పరాకాష్ట

ఆన్లైన్‌ ‌దౌర్జన్యాలు భరించలేక
ఆత్మహత్యలకు పాల్పడే వారు
తెలుగురాష్ట్రాల్లో పెరుతుండడం
పరిస్థితి తీవ్రతకు అద్దం పడ్తుంది

శీఘ్ర ఋణ సౌకర్యం పేరిట
వ్యక్తుల గౌరవ మర్యాదలను
వారి హక్కుల్ని భంగపరచడం
ఉసురు పోసుకోవడం నేరమే!

ఇప్పటికైనా..
నమ్మించి మోసానికి పాల్పడి
అడ్డగోలుగా వడ్డీలు దండుకుని
అమాయక ప్రాణాల్ని హరిస్తున్న
ఆన్లైన్‌ ‌యాప్‌ ‌లను నియంత్రిస్తేనే
అభాగ్య జీవులు బతికి బట్ట కట్టేది

– కోడిగూటి తిరుపతి, 9573929493.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page