ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచిందని, మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ అన్నారు.చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల నేత కార్మికులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కడ్తాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, ఆమనగల్లు మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ ల  అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కడ్తాల్  మండలానికి 9500 బతుకమ్మ చీరలు అందజేసినట్లు గత ప్రభుత్వాలు ఎవరు అమలు చేయని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ ప్రభుత్వం ద్వారానే అందుతున్నట్లు తెలిపారు. 2023 సంవత్సరానికి బతుకమ్మ చీరల తయారీలో తెలంగాణ ప్రభుత్వం 250 డిజైన్లతో 25 రంగులలో చీరలు తెలంగాణ ఆడపడుచులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బిజెపి నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రాజకీయ దళారులను తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ శ్యాంసుందర్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ తల్లోజు విజయకృష్ణ, జెడ్పిటిసి దశరత్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా, మండల రైతు అధ్యక్షుడు జోగు వీరయ్య, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు, జంగమ్మ, గ్రామ రైతు అధ్యక్షుడు నరసింహ, మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, బిక్షపతి, గణేష్, అశోక్ రామచంద్రయ్య ఎంపిడివో రామకృష్ణ, ఏపీఎం రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, మహిళా సంఘం సభ్యులు వనిత,లావణ్య, శైలజ, భారతమ్మ, లక్ష్మమ్మ, యాదమ్మ, విజయ, వసంత, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page