సూసైట్ లెటర్, సిసి పుటేజీల పరిశీలన
హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు
ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. అంతేగాకుండా ఆమె గ్రూప్ పరీక్ష ఎప్పుడూ రాయలేదని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్య కారణాలపై హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వెల్లడిరచారు. 15 రోజుల క్రితమే హాస్టల్ లో చేరిందని చెప్పారు. ఆమె ఇప్పటి వరకూ గ్రూప్`2 సహా ఎటువంటి పోటీ పరీక్షలు రాయలేదని, ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడిరచారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్ దొరికిందని తెలిపారు. ఆమె ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆమె శివరామ్ రాథోడ్‌తో చాటింగ్ జరిపినట్లు ఆధారాలు లభించాయని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసునని చెప్పారు. శిరామ్ రాథోడ్ కు మరో యువతితో ఎంగేజ్ మెంట్ అయిందన్నారు. ప్రవళిక సూసైడ్ నోటును పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, నివేదిక ఆధారంగా శివరామ్ రాథోడ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్యపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయొద్దని కోరారు. ప్రవళిక ఆత్మహత్యపై సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు క్లారిటీ ఇచ్చారు. ప్రేమ వ్యవహారం కారణంగాప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిరదన్నారు. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలుసున్నారు. ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ దొరికిందని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు. రిపోర్ట్ ఆదారంగా శివరాంపై చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శివరాం అనే వ్యక్తితో ప్రవళ్లిక ప్రేమలో ఉందని, కోస్గి మండలానికి శివరాంకు ఈ మధ్య మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్నారు. ఈ విషయం తెలిసి మనస్థాపం చెందిన ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిరదన్నారు. నిన్న ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారని, ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.ప్రవళిక మరణానికి, పరీక్షల వాయిదాకి సంబంధం లేదన్నారు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణమన్న డీసీపీ వెంకటేశ్వర్లు, శివరాం రాథోడ్ అనే యువకుడితో ప్రతి రోజు ఫోన్ కాల్ మాట్లాడేదన్నారు. గతరాత్రి కూడా శివరాం రాథోడ్ తో మాట్లాడినట్లు, ఆమెతో పాటు రూంలో ఉన్న స్టూడెంట్లు తెలిపారని డీసీపీ వెల్లడిరచారు. 15 రోజుల క్రితమే హాస్టల్ లో చేరిందని, ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టం చేశారు. సూసైడ్ లేఖలో ’అమ్మానాన్న నన్ను క్షమించడి. నా కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. ఫణి అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో’ అని రాసినట్లు డీసీపీ తెలిపారు.