ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌

‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే

కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే

సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌….

‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక

మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వారం రోజుల్లో ప్రత్యేకంగా జీవో ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్‌…‌వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి జీవో తెచ్చి అమలు చేస్తానన్నవ్‌…‌కేంద్రంతో సంబంధం లేదన్నవ్‌…‌మరి ఇన్నేళ్లుగా గిరిజన రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు? కేంద్రం అడ్డుకుంటుందని అబద్ధాలు ఎందుకు చెప్పినవ్‌. ‌మరి 8 ఏండ్లుగా పోడు భూముల పట్టాలెందుకు ఇవ్వలేదు. గిరిజన బంధు ఎందుకివ్వలేదు?’’అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తున్నయని తూతూ మంత్రంగా జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 6వ రోజు ఆదివారం పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మల్కాజ్‌ ‌గిరి చౌరస్తా వద్ద మాట్లాడుతూ….ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తునానని, తనతో పాటు పాదయాత్రలో చాలా మంది ప్రజల కోసం తిరుగుతున్నారని అన్నారు. పేదోళ్ల బాధలు, కష్టాలు తెలుసుకునేందుకే…తాను ప్రజల ముందుకు వొచ్చానన్నారు. ఇంట్లో కూర్చోవద్దు…ప్రజల కోసం తిరగాలని మోదీ ఆదేశిస్తేనే… సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.‘‘మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ‌పరిధిలో ఎక్కడికి వెళ్లినా…సమస్యలే స్వాగతం పలుకుతున్నాయన్నారు. ‘ఇక్కడ చేతి గుర్తుకు, కారు గుర్తుకు వోటేశారు. ఎవరికైనా ఇండ్లు వొచ్చాయా? మీరు వోట్లు వేసి గెలిపించిన నాయకులు మీకు ఏం చేశారు? తెలంగాణకు మోడీ మంజూరు చేసిన 2.4 లక్షల ఇండ్లను ఎందుకు కట్టించడం లేదు..?’ అని ప్రశ్నించారు.

కుర్చీ వేసుకుని కూర్చుని, పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి…ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించలేదని స్రశ్నించారు. గుర్రంపోడు ఘటనలో బిజెపి కార్యకర్తలను కాళ్లు, చేతులు విరగ్గొట్టి… 30 రోజులు జైల్లో కూర్చోబెట్టారని, ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదని బండి సంజయ్‌ అన్నారు. ఎస్టీలపై దౌర్జన్యకాండ చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకున్నది ఎవరో… కేసీఆర్‌ ‌ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎస్టీ రిజర్వేషన్లపై దొంగ జీవోలు ఇవ్వడం కాదు. కెసిఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page