మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 02: ఎన్నికల ప్రక్రియలో అంకమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులతో పాటు ప్రజల దృష్టి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్నివిజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఈనెలసిన ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా ఉంటుంది.లెక్కింపు కేంద్రం: ఇబ్రాహీంపట్నం మండలం మంగళపల్లి సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల భవనం శంషాబాదు మండలం పాలమాకుల సమీపంలోని గురుకుల విద్యాలయం భవనం
నియోజకవర్గం : మహేశ్వరం పోలింగ్ కేంద్రాల సంఖ్య : 542 రౌండ్లు 20సమయం: ఆదివారం ఉదయం 8 గంటలు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
రెండు హాళ్లు ఒక్కో హాల్లో 14 టేబుళ్ల చొపున మొత్తం 28 టేబుళ్లు ఉంటాయి.ప్రతి రౌండ్లో 28 ఈవీఎంలను లెక్కిస్తారు.మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత 30 నిమిషాలకు ఈవీఎంలను లెక్కించాలి.పోస్టల్ బ్యాలెట్‌కు ఎనిమిది టేబుళ్లు కేటాయించారు. ఒక్క టేబుల్ మీద 500 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మహేశ్వరం నియోజకవర్గం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎక్కువ కావటంతో అలస్యం కాకూడదని ఆర్వో సూరజ్ కుమార్ సూచనల మేరకు రెండు హళ్లలో కలిపి మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటుఅందులో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు అభ్యర్థుల వారీగా తెలుస్తాయి.చేసి త్వరగా తుది ఫలితం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.ఈవీఎంల సీల్‌ను తొలగించి ఫలితాలకు సంబంధించిన మీట నొక్కుతారు.ఇవి నిషేదం కెమెరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి తీసుకురావద్దు.