ఉత్తమ పౌర జీవనానికి పునాదిగా నిలుస్తున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04: ‌ట్టణ ప్రగతికి  ఇప్పటివరకు రూ. 5 వేల 126 కోట్ల రూపాయలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలు, పట్టణ  ప్రకృతి వనాలతో  తెలంగాణ పట్టణాలు పచ్చదనం పరుచుకున్నవి, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అండర్‌ ‌గ్రౌడ్‌ ‌డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జి మ్‌ ‌లు, బస్తి దవాఖానా లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌, ‌సెంట్రల్‌ ‌లైటింగ్‌లతో  పట్టణ రూపురేఖలు మారి పోయాయి. రాష్ట్ర పట్టణాలు,జాతీయ స్థాయి  గుర్తింపుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నా యి.
రాష్ట్ర ప్రగతికి పట్టణాలు దిక్సూచి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దార్శనికతతో అమలు చేస్తున్న పట్టణ ప్రగతిలో అటువంటి పట్టణాల రూపు రేఖల్నే మారాయి. పట్టణ ప్రగతి పేరిట  పట్టణాలు సరికొత్తగా రూపు దిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం  భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

నగరాలు, పట్టణాల్లో అన్ని మౌలిక వసతుల కలిపిస్తూ, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం, రోడ్లు, కూడళ్ల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం  129  మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కలిపి  మొత్తం 142  అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీస్‌లో 3618  వార్డులు ఉండగా 6085  స్క్వేర్‌ ‌కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు  కోటి 44  లక్షల జనాభా కలిగివున్నది.  పట్టణ ప్రగతిలో భాగంగా ఇప్పటి వరకు రూ. 5126 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కు రూ.2787 .90  కోట్లు, 141అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీస్‌ ‌కు రూ.2338.14 కోట్ల రూపాయలను పట్టణ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 10శాతం గ్రీన్‌ ‌బడ్జెట్‌, ‌వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్లు, మినీట్యాంక్‌ ‌బండ్‌, ‌వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ ‌టాయిలెట్లు, పార్కులు, ఓపెన్‌ ‌జిమ్‌లు తదితర నిర్మాణాలను చేపట్టింది. పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది.

 ప్రగతితో పరుగులెడుతున్న పట్టణాలు :
పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగైన జీవన విధానం కొరకు  రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాలుగు విడుతల్లో  రాష్ట్రం లోని నాలా అభివృద్ధికి   రూ. 5126 .04 కోట్ల  రూపాయల నిధులను విడుదల చేసింది.  నర్సరీలు, 3468  వార్డులలో ఇప్పటికే 2818    పట్టణ ప్రకృతి వనాలలో ఈ ఏడాది మార్చి నాటికి  34.85  లక్షల మొక్కలు నాటారు. ఈ ఏడాది మరో 650 పట్టణ ప్రకృతి వనాలను  ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మినహా 141 మునిసిపాలిటీలు పరిధిలో  1208.52 కిలోమీటర్ల మేర అవెన్యూ  ప్లాంటేషన్‌ ‌చేపట్టారు. అలాగే హరితహారం లో భాగంగా గత ఏడాది 252  లక్షల మొక్కలు నాటగా ఈ ఏడాది 214.91 లక్ష్యంతో పచ్చని పట్టణాలుగా మలిచే ప్రయత్నంతో ప్రభుత్వం ముందుకు పోతోంది.

ఇందుకు గాను 1612  నర్సరీలను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం, పచ్చదనంతో పాటు  ఆరోగ్యం, మెరుగైన మౌలిక సదుపాయాల పైన ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా  368 ఓపెన్‌ ‌జిమ్‌లు ఏర్పాటు చేశారు. 1916  క్రీడా ప్రాంగణాలు మంజూరి చేయగా 1273  పూర్తి అయినవి. జీహెచ్‌ ఎం‌సీ మినహా 95  అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీస్‌ ‌లో 193  బస్తి దవాఖానాలకు గాను 173 ఇప్పటికే ఏర్పాటుచేశారు. అదేవిధంగా  144  ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌ ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్లు మంజూరి కాగా 16 పూర్తి కాగా , మిగిలినవి  ముగింపు స్థాయిలో ఉన్నాయి. 141  ధోబీఘాట్లుమంజూరి కాగా పనులు వివిధ దశలలో ఉన్నాయి. 453  వైకుంఠధామాలను అభివృద్ధి చేస్తున్నారు.

మెరుగైన పారిశుధ్యం పట్టణాల స్వంతం:
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మున్సిపాలిటీలలో పారిశుధ్య దుస్థితి అధ్వాన్నంగా ఉండేది. విధులలో చెత్త పేరుకుపోయేది. చెత్తకుండీలు నిండిపోయి వాటిని తొలగించేవారు లేక విధులు దుర్వాసనభరితంగా ఉండేవి . వర్షం పడితే  మురుగు కాల్వలు నిండి దోమలుతో అంటురోగాలు వ్యాపించేవి. అటువంటిది నేడు విధులలో చెత్తకుండీలు తొలగించడంతో పాటు విధులన్నీ రోజు ఊడుస్తూ చెత్తని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.  గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మినహా మిగిలిన 141  మున్సిపాలిటీల్లో గతంలో  పారిశుధ్య వాహనాలు 2548  ఉండగా మరో 2165  కొనుగోలు చేసి దదాపు రోజు  4356  టన్నుల చెత్తను  తొలగిస్తున్నారు. ఇందుకు మునిపాలిటీకి ఒక డంపింగ్‌ ‌యార్డును ఏర్పాటు  చేశారు. పారిశుధ్యం పై  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వాహనాలు కొనుగోలు చేసి పారిశుధ్య సిబ్బంది ని పెంచి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతోంది. కంపోస్ట్ ‌షెడ్డు ఏర్పాటు చేసి  తడి పొడి చెత్తను వేరుచేసి ఎరువుగా మారుస్తున్నారు.

 పట్టణ సుందరీకరణకు పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం
పట్టణ సుందరీకరణకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తూ పట్టణాల రూపు రేఖలను మారుస్తోంది. ప్రధాన రహదారులను వెడల్పు చేసి, కూడళ్లను అభివృద్ధి  చేసి   సెంట్రల్‌  ‌లైటింగ్‌  ఏర్పాటు చేయడంతో  వీదులు వెలుగులతో విరాజిల్లుతున్నాయి. మౌలిక వసతుల పెంపు, మెరుగైన పారిశుధ్యం, పచ్చదనం వైకుంఠధామాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్‌ ‌జిమ్‌ ‌లు, వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్ల నిర్మాణం,  పబ్లిక్‌ ‌టాయిలెట్లు, సెంట్రల్‌ ‌లైటింగ్‌ , ‌డ్రైనేజీ కాలువలు వంటి నిర్మాణాలతో రాష్ట్రంలోని పట్టణాలు అభివృద్ధిలో తారాస్థాయికి చేరుకున్నాయి. పట్టణ ప్రగతితో దేశస్థాయిలో తెలంగాణ పట్టణాలు గుర్తింపు సాధిస్తున్నాయి.

 స్పెషల్‌ ‌కమీషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page