ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత పాశాలకు తక్కువ అన్నట్లు ఉంది.  ఇక తెలంగాణకు  సమ్మక్క సారలమ్మ పేరుతో  980 కోట్లతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారంట.  నిజామాబాద్‌ ‌రైతాంగం పసుపు బోర్డు ఏర్పాటు చేయమని  గత పది సంవత్సరాలుగా డిమాండ్‌ ‌చేస్తుంటే  ఎన్నికలు రెండు నెలల ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని  ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నారు.  2019  ఆగమేఘాల మీద  ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు  పది శాతం రిజర్వేషన్లు కల్పించారు. యాభై ఏడు శాతం పైగా ఉన్న  ఒబిసిలను  27 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేసి కులగణన చేపట్టకుండా ఇప్పుడు  మహిళా రిజర్వేషన్ల పేరుతో నాటకం ఆడుతున్నారు.  పన్నెండు లక్షల కోట్లు  కార్పొరేటు ఎగవేతదారుల బ్యాంకు రుణాలను రైటాఫ్‌ ‌చేసి చిన్న సన్నకారు రైతుల రుణాలకు  ఇంట్రెస్ట్ ‌సబ్వెన్షన్‌, ‌ప్రాంప్ట్ ‌రీపేమెంట్‌ ఇన్సెంటివ్‌ ఇవ్వకుండా ముక్కుపిండి  వసూలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.  కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన  విద్యుత్‌ ‌బిల్లు, సంస్కరణల మూలంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారు.  అలాగే కేంద్రం ప్రవేశ పెట్టిన   మునిసిపల్‌ ‌మరియు అర్బన్‌ ‌డెవెలప్మెంట్‌ ‌లో సంస్కరణల్లో  భాగంగా ఆస్తిపన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, స్వచ్ఛ భారత్‌ ‌సెస్‌ ‌విపరీతంగా పెంచారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం  గతంలో  ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్పొరేట్‌ ‌శక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్‌ ‌శక్తుల చేతులలో బంది చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలను మోస గించారు.ఉద్యోగాలు కల్పన, ఉపాధి భ్రాంతి గానే  మిగిలిపోయింది. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత మందికి చేశారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి సొమ్మంతా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి రూ. 15 లక్షలు అకౌంట్‌ ‌లో వేస్తానన్న మోదీ ఇప్పటికీ ఎంతమంది అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారు..?  దేశంలో నిరుద్యోగం పెరిగి, ప్రజల ఆదాయ వనరులు తరుగుతున్నాయి. ధరలు రోజురోజుకూ పెరుగుతు న్నాయి. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు, కేటాయింపులు పడిపోతున్నాయి. రైతులు, ఇతర అన్ని తరగతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రజల అప్పులు పెరుగుతున్నాయి. శత కోటీశ్వరుల అప్పులు రద్దు అవుతున్నాయి.వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన సంఖ్యలో ఉన్న కుబేరుల సంపద అంతులేకుండా పెరుగుతున్నది ఎవరి మద్దతుతో ఇలా జరుగుతున్నది అనే సత్యం ప్రజలు తెలుసుకుంటున్నారు.

మోదీ• ప్రభుత్వం  రాఫెల్‌ ‌కుంభకోణం  రూ. 68 వేల కోట్ల విలువైన రాఫెల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై పెద్దఎత్తున అవినీతి, మనీ లాండరింగ్‌, ఆ‌శ్రిత పక్షపాతం, అక్రమాలు, పన్నుల మాఫీల ద్వారా అనుచిత లబ్ధి వంటి ఆరోపణలు వెలువడ్డాయి. రక్షణ పరికరాల సమీకరణ పద్ధతి (డిపిపి) కింద 126 రాఫెల్‌ ‌యుద్ధ విమానాలను సమకూర్చుకునేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. డసాల్ట్ ‌నుండి హెచ్‌.ఎ.ఎల్‌ ‌కు సాంకేతికతను బదిలీ చేసుకుని, దానితో వీటిలో 108 విమానాలను భారత్‌కు  చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ (‌హెచ్‌.ఎ.ఎల్‌) ‌తయారుచేసి ఇచ్చేలా కూడా అంగీకారం కుదిరింది.  ఒప్పం దాన్ని కాదని ఆనాడు మోదీ• తాజాగా ఒప్పందాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రధాని మోదీ• ఆనాడు ఫ్రాన్స్ ‌పర్యటనలో ప్రకటించిన ఒప్పందంలో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఏరో స్పేస్‌ ‌భాగస్వామ్యాన్ని అకస్మా త్తుగా ప్రవేశపెట్టారు. ఏరోనాటిక్స్‌లో రిలయన్స్ ‌కంపెనీకి అప్పటికి ఎలాంటి అనుభవం లేదు. పైగా కంపెనీ ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నది, ఇటువంటి ప్రాజెక్టుకు అవస రమైన మౌలిక సదుపాయాలు కూడా లేదు.

డసాల్ట్ ‌కు, ఏవియేషన్‌ ‌రంగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ ఏరో స్పేస్‌కు మధ్య అకస్మాత్తుగా ఒప్పందం కుదరడం, పైగా భారత్‌లో పాలక వర్గంతో అనిల్‌ అం‌బానీకి వున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఒప్పందం చుట్టూ అనేక ఆరోపణలు అలుముకున్నాయి.  ఛత్తీస్‌గఢ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బొగ్గు బ్లాకులను అభివృద్ధి చేసి, బొగ్గు తవ్వేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల జారీపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2014లో వాటన్నింటినీ రద్దు చేసింది.  అప్పుడే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, గనుల అభివృద్ధి, ఖనిజాన్ని వెలికితీయడానికి లైసెన్సులు జారీ చేసే అంశంపై 2015లో కొత్త చట్టం తెచ్చింది.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని పర్సా, కంటా బొగ్గు బ్లాకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి. కానీ, వాటిల్లో బొగ్గు తవ్వుకొనేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకుఅనుమతిఇచ్చింది.ఆర్‌ఆర్‌బీ యూఎన్‌ ఎల్‌కు 25 శాతం వాటా దక్కగా, ఏఈఎల్‌కు ఏకంగా 75 శాతం వాటా దక్కింది. ఇది పూర్తిగా చట్టవి రుద్ధం. వాటాలు తల్లక్రిందులు కావటంతో ఈ జాయింట్‌ ‌వెంచర్‌పై రాజస్థాన్‌ ‌ప్రభుత్వానికి దక్కాల్సిన యాజమాన్య హక్కులు అదానీ గ్రూప్‌ ‌చేతుల్లోకి వెళ్లిపోయాయి.

కోల్‌ ఇం‌డియా నిబంధనల ప్రకారం దేశంలోని థర్మల్‌ ‌విద్యుత్తు కేంద్రాల్లో క్యాలరిఫిక్‌ ‌విలువ 2,200 కిలోక్యాలరీల కనిష్ట స్థాయివరకు ఉన్న బొగ్గును కూడా వినియోగించవచ్చు. కానీ, ఆర్‌ఆర్‌బీ యూఎన్‌ఎల్‌, ఏఈఎల్‌ ‌మధ్య కుదిరిన ఒప్పం దంలో ఈ విలువను ఏకంగా 4 వేల కిలో క్యాలరీలు పెంచేశారు. అంటే పర్సా, కంటా గనుల్లో తవ్విన బొగ్గులో క్యాలరిఫిక్‌ ‌విలువ 4 వేల కిలోక్యాలరీలకంటే ఎక్కువ ఉన్న నాణ్యమైన బొగ్గునే వినియోగించాలి. అంతకంటే తక్కువ ఉన్న బొగ్గును ఆర్‌ఆర్‌బీయూఎన్‌ఎల్‌ ‌తన ప్లాంట్లలో వినియోగించకుండా తిరస్కరించవచ్చు. ఈ ఒప్పందం వెనుక అదానీ గ్రూప్‌నకు ఆయాచిత ప్రయోజనం కల్పించే దురుద్దేశమే. ఆర్‌ఆర్‌బీ యూఎన్‌ఎల్‌ ‌తిరస్కరించిన బొగ్గులో 25 శాతాన్ని ఏఈఎల్‌ ఉచితంగా తీసుకొని వేరే పవర్‌ప్లాంట్లకు విక్రయిం చుకోవచ్చని జాయింట్‌ ‌వెంచర్‌ ‌నిబంధనల్లో పొందు పర్చారు. ఈ రెండు బ్లాకుల్లో వెయ్యి మిలియన్‌ ‌టన్నుల బొగ్గును వెలికితీయాలని ఈ కంపెనీల లక్ష్యం. అంటే మొత్తం బొగ్గులో 25 శాతం అంటే.. 250 మిలియన్‌ ‌టన్నుల బొగ్గును అదానీ గ్రూప్‌ ఉచితంగా పొంది, తనకు ఇష్టం వచ్చిన కంపెనీలకు అమ్ముకోవచ్చు. దానివల్ల వచ్చే ఆదాయంలో పైసా కూడా ఆర్‌ఆర్‌బీ యూఎన్‌ఎల్‌కు ఇవ్వాల్సిన పనిలేదు. అంటే అదానీ గ్రూప్‌ ఉచితంగా లభించే 25 శాతం బొగ్గుతోనే రూ.లక్ష కోట్లు సంపాది ంచుకొనే అవకాశం లభించింది.

గతంలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రసక్తే లేదని ప్రకటించిన మోదీ నేడు వేలానికి  సిద్ధమవుతున్నారు.  బీజేపీ పెట్టిన అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ ప్రత్యక్ష మద్దతు తెలిపారు. అలాగే ప్రతిపక్షాల పై సీబీఐ, ఇడి దాడులు జరిగినప్పుడు, నాయకులపై చర్యలకు ఉపక్రమించినప్పుడు, బిజెపి నాయకులు లైంగిక దాడులు చేసినప్పుడు, సామజిక సమగ్రత లేకుండా ఒక వర్గంపై దాడులు చేసినప్పుడు తెలుగుదేశం, జనసేన, వైఎసార్సీపీ  పరోక్ష మద్దతు తెలపడం సిగ్గుచేటు.  రాబోయే  ఎన్నికల్లో  విజ్ఞత కలిగిన ప్రజలు  అవకాశవాద మతతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారని ఆశిద్దాం. వచ్చే అన్ని రాష్ట్రాల శాసనసభ  2024 పార్లమెంట్‌  ఎన్నికల్లో  కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీయడానికి• ఇప్పటి నుండి  ప్రజలంతా ఏకం కావాలి.
image.png
డా. ముచ్చుకోట సురేష్‌బాబు,
అధ్యక్షులు,
ప్రజా సైన్స్ ‌వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page