ఉర్దూ మతం భాష కాదు.. మన అందరి భాష

  • ముస్లింలదన్న భావన సరికాదు
  • ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది: మంత్రి కెటిఆర్‌
  • కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : పార్లమెంటులో పదాల నిషేధంపై మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది అందరి భాష అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరించడం తగదన్నారు. తాతలు, మా తాతలు అందరూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ వి•డియంలోనే చదువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అనర్గళంగా మాట్లాడేవారు. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు. కాకపోతే ఒక మతాన్ని టార్గెట్‌ ‌చేసి.. కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దుండిగల్‌ ‌పరిధిలోని బహదూర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఇక్కడ ఉర్దూ వి•డియం కాలేజీని మంజూరు చేయిస్తామని చెప్పారు. ఉర్దూ అంటే ఒక మతం భాష అని కొందరు మూర్ఖులు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మతం భాషగా చిత్రీకరించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు.

ఒక వైపు ప్రధాని మోదీ ఉర్దూను ప్రమోట్‌ ‌చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇక్కడున్న వారేమో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ.. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరిస్తున్నారు. కొందరు సన్నాసులు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. భాషను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా, కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు.. ఉర్దూ వి•డియంలో కూడా కళాశాలను మంజూరు చేయిస్తాం. ఉర్దూ, ఇంగ్లీష్‌, ‌తెలుగు భాష వ్యత్యాసాలు తెలియవు. అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలనే విషయం మాత్రమే తెలుసని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలన్నా సంతోషమే అని, అందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. ఇదిలావుంటే కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి,సబితా ఇంద్రారెడ్డిలు కూడా పాల్గొన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : పార్లమెంటులో పదాల నిషేధంపై మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని మంత్రి కెటిఆర్‌ ‌మండిపడ్డారు. పార్లమెంట్‌లో వాడకూడదంటూ కొన్ని పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై కేటీఆర్‌ ‌మండిపడుతూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎన్‌పీఏ(నాన్‌ ‌పర్ఫార్మింగ్‌ అసెట్‌) ‌గవర్నమెంట్‌ ‌పార్లమెంట్‌ ‌లాంగ్వేజ్‌ ఇదే అని కేటీఆర్‌ ‌కొన్నింటిని ఉదహరిస్తూ ట్వీట్‌ ‌చేశారు. ఆందోళనకారులను ఆందోళన్‌ ‌జీవి అని ప్రధాని పిలవడం వారి పార్లమెంట్‌ ‌భాష అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఓ మంత్రి వ్యాఖ్యానించిన గోలిమారో సాలోం కో అనే వ్యాఖ్య, 80-20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించడం, మహాత్మాగాంధీని కించపరిచిన బీజేపీ ఎంపీ తీరు, ఆందోళన చేస్తున్న రైతులను అవమానపరుస్తూ.. వారిని టెర్రరిస్టులు అని సంబోధించడం..వారి పార్లమెంట్‌ ‌భాష అని కేటీఆర్‌ ‌విమర్శిస్తూ ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page