ఎన్నికల నిబందనలు పాటిస్తు ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులను నిర్వహించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 17 :ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ,పూర్తి అవగాహనతో ఎలాంటి పొరపాట్లుజరగకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ భారతి హోలీకేరీ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లాఎన్నికల అధికారి,కలెక్టర్ భారతి హోలీకేరీ, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ తో కలిసి రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల
నిర్వహణలో భాగంగా నిర్వహించవలసిన కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉండాలని,ఈ.వీ.ఎంల నిర్వహణపై,బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, తదితర అంశాలపై అవగాహనకలిగి ఉండాలన్నారు.బ్యాలెట్ పత్రాల ముద్రణలోనూ ఎలాంటి తప్పిదాలకుఆస్కారం ఇవ్వరాదన్నారు.రిటర్నింగ్ అధికారి పరిధిలోగల అన్ని టీములకు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కల్పించాలని రిటర్నింగ్అధికారులకు సూచించారు.ఎన్నికల (ఈవీఎంలు, వివి ఫ్యాట్ లను) పంపిణీకేంద్రాల నుండి మరియు పోలింగ్ ముగిసిన తరువాత రిసెప్షన్ సెంటర్లకుజాగ్రత్తగా తీసుకువెళ్ళే విధంగా పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు.సిబ్బందికి వాహనాలు ఏర్పాటు చేయాలని,పోలింగ్ కేంద్రాలలలో సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, అవసరమైన త్రాగునీరు,విద్యుత్ సరఫరా, ఫర్నీచర్,టాయిలెట్స్ వసతులను పరిశీలించాలని
సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు  ఏర్పాటు చేయాలని సూచించారు.పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూఅన్నిజాగ్రత్తలుతీసుకోవాలన్నారు పిడబ్ల్యుడి, సీనియర్ సిటిజన్స్ కు ఫామ్ -12 డి ఇవ్వాలన్నారు.ప్రతిఓటర్ కు ఓటర్ సమాచార స్లిప్పులను వంద శాతం పంపిణీ చేయాలని సూచించారు.పోలింగ్ ప్రక్రియకు అవసరమైన ఆయా అన్ని పనులు ముందస్తు ప్రణాళికతో పూర్తిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులు, రవాణా శాఖఅధికారులు,ఎన్నికల విభాగం అధికారి సైదులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page