సిఎం రేవంత్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో భారతీయ జనతా పార్టీపై చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని ఆనాడు రేవంత్ రెడ్డి వాఖ్యానించారు. అంతేకాక 2025 నాటికల్లా దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందన్నారు.
ఆ కుట్రలో భాగంగానే దేశాన్ని హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. బిజెపి మరోసారి అధికారంలోకి వొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. అయితే కింది కోర్టులు పదేపదే వాయిదా వేస్తుండడంతో వెంకటేశ్వర్లు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.