- టిడిపి సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని
- రెండు రోజులపాటు టిడిపి సభ్యుల సస్పెన్షన్
- టిడిపి తీరుపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిన స్పీకర్
- చంద్రబాబు తీరుపై మండిపడ్డ మంత్రి కొడాలి నాని
అమరావతి, మార్చి 23 : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలు వరుసగా కొనసాగుతున్న తీరు విమర్శలకు దారితీసింది. టిడిపి సభ్యలు నిరసన పరాకాష్టకు చేరింది. అసెంబ్లీలో చిరుతల వాయింపుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీకి చిడతలు తీసుకొచ్చి వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ఔన్నత్యాన్ని కాలరాస్తు న్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. సారా మరణాలపై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబడుతూ టీడీపీ సభ్యులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగిరమేశ్ మాట్లాడుతూ విలువైన సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న టీడీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేనని అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఒక్క సమస్యను ఎన్ని రోజులు సాగదీస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రోజుకో విధంగా వీరు డ్రామాలు వేస్తున్నారని అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక ఇలాంటి వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఏపీలో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్‌షాపులను రద్దు చేశారని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ఏపీలో చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్‌షాపులను రద్దు చేశారని తెలిపారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా అమూల్‌పై అడిగిన ప్రశ్నకు సంభందించి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల చిడతలు కొట్టారు. అమూల్ వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభించేసింది అన్న వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల నిరసన భజన చేశారు. సభలో చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కు సంస్కారం ఉందా, ఇంగిత జ్జానం లేదా. శాసనసభ ఔన్నత్యాన్ని దిగజార్చుతున్నారు. సభలో విజిల్స్ వేస్తారు. భజన ఇక్కడ కాదు ఎక్కడికో వెళ్లి చేసుకోండి. మానవత్వం లేని వ్యక్తుల్లా వ్యవహిరస్తున్నారు. దీని కోసమా ఇంత మంది త్యాగాలతో ఈ సభ. కు ఓటేసిన ప్రజలు చూస్తున్నారు. ఇవి పిల్లచేష్టలు‘ అంటూ స్పీకర్ తీవ్ర పదజాలంతో దూషించారు. టీడీపీ సభ్యుల చేతుల్లో నుంచి చిడతలు తీసుకోవాల్సిందిగా సభాపతి ఆదేశించారు. కల్తీ సారాపై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండు చేస్తూ టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. మరో వైపు టీడీపీ సభ్యులు సభలో చిడతలు కొట్టడంపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరకు చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు సభకు తాగొస్తున్నా రేమోనని అనుమానంగా ఉందని.. డ్రంకెన్ టెస్ట్ చేయాలన్న జక్కంపూడి రాజా అన్నారు. పొరపాటున 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారంటూ మల్లాది విష్ణు వ్యాఖ్యలు చేశారు.
టిడిపి ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం సమాధానం ఇచ్చినట్లుగా పరిగణించారు. తరవాత సభలో జీరో అవర్ కొనసాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీచుడు, నికృష్టుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. సభలో ఉన్న ఐదుగురు సభ్యులు సస్పెండ్ అయి రావాలంటూ చంద్రబాబు పంపారని కొడాలి నాని ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈవాళ అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనలు, మరోవైపు సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇది నడుస్తూనే ఉంది.. అయితే, టీడీపీ సభ్యుల వ్యవహార శైలిపై స్పీకర్ సంచలననిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేశారు. సభలో టీడీపీ సభ్యుల వ్యవహారాల శైలిని పరిశీలించి.. తగిన చర్యలు సూచించనుంది ఎథిక్స్ కమిటీ.. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీ చేశారు.
గత కొద్ది రోజులుగా కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించటం, స్పీకర్ పై కాగితాలు చించి వేయటం, ఈలలు వేయటం, చిడతలు తెచ్చి రభస, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం లాంటి కార్యక్రమాలు చేశారని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. సభ్యుల వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరపనుంది.. అసెంబ్లీకి సంబంధించిన వీడియో ఫూటేజ్‌ను కూడా ఎథిక్స్ కమిటీ పరిశీలించ నుంది.. టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని ఎథిక్స్ కమిటీకి స్పీకర్ తమ్మినేని.. రిఫర్ చేయడంతో.. ఎథిక్స్ కమిటీ విచారణ, సూచించే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే శాసనమండలిలోనూ టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. కల్తీ సారాపై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. మాకు సమయం ఇవ్వాలంటూ ఛైర్మన్‌ను టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ సమాధానమిస్తూ…‘మొదటి రోజున వాయిదా తీర్మాణం తిరస్కరించిన తరువాత మరలా అదే అంశం తెస్తున్నారు. ప్రభుత్వం చెప్పే సమాధానం వినకుండా రు మాట్లాడుతాం అంటే కుదరదు. కు వివరణ ప్రభుత్వం నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తాం‘ అని తెలిపారు.