ఎపి కొత్త సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి

పేరును ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యింద. ప్రస్తుత సిఎస్‌ ‌సర్‌ ‌శర్మ పదవీ కాలం ఈనెల 30న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా ఎవరు ఎంపికవుతారనే అంశం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎస్‌ ‌రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ దిశగానే నియామకం ఉంటుందన్న చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠకు తెర దించుతూ.. చర్చలు, సమాలోచనల తర్వాత ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌ ‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి చాలా మంది సీనియర్‌ ఐఏఎస్‌లు పోటీ పడ్డారు. పోటీలో ఎంత మంది ఉన్నా.. ముఖ్యమంత్రికి స్పెషల్‌ ‌సెక్రెటరీగా వ్యవహరిస్తున్న జవహర్‌రెడ్డి వైపు జగన్‌ ‌మొగ్గు చూపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం చాలా మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పోటీపడ్డారు.

1987వ బ్యాచ్‌కు చెందిన నీరభ్‌ ‌కుమార్‌ ‌ప్రసాద్‌, 1988 ‌బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికాల్‌ ‌వలెవన్‌తో పాటు 1988 బ్యాచ్‌కు చెందిన గిరిధర్‌ అర్మాణెళి పేరు కూడా గట్టిగానే వినిపించింది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోన్న గిరిధర్‌ అర్మాణెళి.. రెండు రోజుల క్రితం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో ఆయన్ను సీఎస్‌గా నియమిస్తున్నార న్న వార్తలు వినిపించాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ పేరు కూడా తెరపైకి వచ్చినా.. అనుహ్యం గా సీఎస్‌గా 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జవహర్‌ ‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జవహర్‌ ‌రెడ్డికి సీఎం జగన్‌ ‌మెదట్నుంచి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత మరింత పెరిగింది. సీఎం జగన్‌ ఆయన్ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా, సీఎం స్పెషల్‌ ‌సెక్రెటరీగా నియమించింది.

సర్‌ ‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనుండగా.. అదే రోజు జవహర్‌ ‌రెడ్డి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జవహర్‌ ‌రెడ్డి సీఎస్‌గా 2024 జూన్‌ ‌వరకు సర్వీస్‌లో ఉంటారు. 2024 ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన రిటైర్‌ ‌కానున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్‌ ‌జవహర్‌ ‌రెడ్డి వైపు మె?గ్గు చూపారనే చర్చ నడుస్తోంది.మరోవైపు సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సర్‌ ‌శర్మకు కూడా జగన్‌ ‌సర్కారు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ ‌గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్ అం‌డ్‌ ‌గవర్నెన్స్ (ఐఎల్‌ఈ అం‌డ్‌ ‌జీ) వైస్‌ ‌ఛైర్మన్‌ ‌పోస్టులోనూ ఆయనను ఇంఛార్జ్‌గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page