ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన

  • నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ
  • రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్‌
  • ‌శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
  • భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం

ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్‌ ‌బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానికి స్వాగతం పలికేందకు సిఎం జగన్‌ ‌కూడా విశాఖ రానున్నారు. ఇక్కడ ఏర్పాట్లను ఎంపి విజయసాయితో పాటు, మంత్రులు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ప్రాజెక్టుల్లో రూ.10,500 కోట్ల విలువ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 11, 12ల్లో నాలుగు రాష్టాల్ల్రో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 11న ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీలో సన్యాసి కవి కనక దాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్‌ ‌రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 36‌వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు.

రాత్రికి విశాఖ చేరుకుని 12న ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోడీ ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణాలోని రామగుండంలో ఉన్న ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ‌ప్లాంట్‌ను ప్రధాని సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం 4:15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో రూ.3,750 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ ‌రారుపూర్‌-‌విశాఖపట్నం ఎకనామిక్‌ ‌కారిడార్‌లో ఏపి విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. విశాఖపట్నంలోని కాన్వెంట్‌ ‌జంక్షన్‌ ‌నుండి షీలా నగర్‌ ‌జంక్షన్‌ ‌వరకు ప్రత్యేక పోర్ట్ ‌రోడ్డుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. శ్రీకాకుళం-గజపతి కారిడార్‌లో భాగంగా రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఎన్‌హెచ్‌-326ఎలోని నరసన్నపేట నుండి పాతపట్నం సెక్షన్‌ను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు.

ఒఎన్‌జిసి యు-ఫీల్డ్ ఆన్‌షోర్‌ ‌డీప్‌ ‌వాటర్‌ ‌బ్లాక్‌ ‌ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తారు. ఇది రూ.2,900 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. దాదాపు 6.65 ఎంఎంఎస్‌సిఎండి సామర్థ్యంతో గెయిల్‌ శ్రీ‌కాకుళం అంగుల్‌ ‌సహజ వాయువు పైప్‌లైన్‌ ‌ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2,650 కోట్లకు పైగా వ్యయంతో 745 కిలో టర్ల పొడవున ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. నేచురల్‌ ‌గ్యాస్‌ ‌గ్రిడ్‌ (ఎన్‌జిజి)లో భాగంగా ఆంధప్రదేశ్‌, ఒరిస్సాలోని వివిధ జిల్లాల్లో ఇల్లు, పరిశ్రమలు, వాణిజ్య యూనిట్లు, ఆటోమొబైల్‌ ‌రంగాలకు సహజ వాయువును సరఫరా చేయడానికి పైప్‌లైన్‌ ‌కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఆంధప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సిటీ గ్యాస్‌ ‌డిస్టిబ్యూష్రన్‌ ‌నెట్‌వర్క్‌కు ఈ పైప్‌లైన్‌ ‌సహజ వాయువును సరఫరా చేస్తుంది. ••దాపు రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ‌పునరాభివృద్ధికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్‌ ‌రోజుకు 75,000 మంది ప్రయాణీకులను అందిస్తుంది. ఆధునిక సౌకర్యాలను అందించడంతో ప్రయాణీకుల అవసరాలను మెరుగుపరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page