ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బిజెపి

దిల్లీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కూడా యత్నించారు
మీడియా సమావేశంలో మండిపడ్డ దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా
న్యూ దిల్లీ, అక్టోబర్‌ 29 : ‌తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. రు మా పార్టీలో చేరితే ఈడీ, సీబీఐలు జోలికి రావంటు బీజేపీ చెబుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని సిసోడియా తెలిపారు. అసలు ఇంత డబ్బు బిజెపికీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కొనుగోలు వ్యవహారం వెనక అమిత్‌ ‌షా ఉండటం సిగ్గుచేటని సిసోడియా పేర్కొన్నారు. శనివారం ఆయన డియాతో మాట్లాడుతూ పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.

తమ పార్టీలో చేరితే ఈడీ, సీబీఐ దాడులు ఉండవంటున్నారని, ఎమ్మెల్యేలను కొనడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. ఇంత డబ్బు బీజేపీకీ ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కేంద్రమంత్రి అమిత్‌ ‌షా ఉండటం సిగ్గుచేటని మనీష్‌ ‌సిసోడియా దుయ్యబట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ ‌పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు.. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ ‌కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందిగానీ.. పోలీసులు ఆ విషయాన్ని నిర్దారించలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన ఈ సంఘటన హైదరాబాద్‌ ‌నగర శివార్లలోని మొయినాబాద్‌ ‌మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌసలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page