ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన  కాంగ్రెస్ కే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎరుకల సామాజికవర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తామని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ 79/1956-57 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కెంబసారం కృష్ణ, కూరాకుల కృష్ణలు ప్రకటించారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ షెడ్యూల్డ్ తెగలలో అత్యంత వెనుకబడి ఉన్న ఎరుకల సామాజికవర్గనికి సామజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి, మానిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్ధిల్లా శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామజిక న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ మూలవాసులు, ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించిన ఎరుకల కులస్తులకు రేజర్వేషన్లు కూడా దక్కడంలేదని, ఎస్టీ కార్పొరేషన్ లో తీవ్ర అన్యాయం జరిగిందని, ఒకే గిరిజన సామాజికవర్గమే విద్య, ఉద్యోగ రంగాల్లో రేజర్వేషన్లను కొట్టుకుపోతుందని, ఎరుకల జాతికి అన్యాయం జరుగుతుందని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జరగడంలేదని, కేవలం ఎరుకల జాతిని ఓటు బ్యాంకుగా ప్రభుత్వం వాడుకుండే తప్ప చేసింది ఏమిలేదని, దళితులకు ఇచ్చిన దళితబందు గిరిజనులకు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని వారు వాపోయారు. ఎరుకల సమాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో ఆనాడు కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని, ఉద్యోగాలు కూడా కల్పించింది కాంగ్రెస్ వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ ప్రచారం ప్రారంభించిందని, అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల విజయంకోసం ఎరుకల సమాజం అహర్నిశలు పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ్ సలహాదారుడు దేవసారి జైపాల్, ఉపాధ్యక్షులు కూతాడి రవి, నేతలు కావడి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page