ఏ అభియోగం కింద అరెస్ట్ ‌చేశారు: డిజిపికి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రశ్న

కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్‌ ‌చుగ్‌
‌బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌

హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు..యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ ‌స్టేషన్‌లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్‌ ‌కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్‌పై రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఆ‌గ్రహం
తెలంగాణలో కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఇక ఆయనను సాగనంపడమే తరువాయి అని బండి సంజయ్‌ అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ ‌తీరును తప్పుపట్టారు. బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 8‌వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు భయపడే… ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ‌విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అహంకారానికి బండి సంజయ్‌ అరెస్ట్ ఒక నిదర్శనం అని తరుణ్‌ ‌చుగ్‌ ‌వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌కు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే.. బీజేపీ నాయకులెవరూ భయపడరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలెవరూ భయపడవద్దని తరుణ్‌ ‌చుగ్‌ ‌భరోసా ఇచ్చారు.

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌
‌బండి సజయ్‌ను అర్ధరాత్రి అకారణంగా, అక్రమంగా అరెస్ట్ ‌చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వి•డియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. అయినా తమ పోరాటం ఆగదన్నారు. గతంలో తీన్మార్‌ ‌మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు.. ఇది బయటపడకుండా ఉండడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్ ‌చేశారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు లీకేజీ కారణంగా ఆగమయ్యాయని తెలిపారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్ ‌చేశారన్నారు. పార్లమెంట్‌ ‌వేదికగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిలదీస్తామని లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page