మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కీసరలోని బోగారం హోలీమేరి ఇంజనీరింగ్ కాలేజీలో ఐదు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్ ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ నేడు రోజున ఐదు నియాజకవర్గాలకి 2439 పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 105 రౌండ్స్ కి, 116 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ కి మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్ లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అలాగే పార్టీ ఏజెంట్ల తో పాటు రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. కౌంటింగ్ రోజున నిఘా నీడలో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామని అన్నారు. (43)మేడ్చల్ 584 పోలింగ్ కేంద్రాలు, 21 రౌండ్స్, కౌంటింగ్ టేబుల్స్ 28, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్-04, (44) మల్కజ్ గిరి 429 పోలింగ్ కేంద్రాలు,21 రౌండ్స్, కౌంటింగ్ టేబుల్స్ 20, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్-02, (45) కుతుబులాపూర్ 590 పోలింగ్ కేంద్రాలు, 21 రౌండ్స్ కి కౌంటింగ్ టేబుల్స్ 28. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్-02, (46) కూకట్ పల్లి, 418 పోలింగ్ కేంద్రాలు, 21రౌండ్స్, కౌంటింగ్ టేబుల్స్ 20, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్-01, (47) ఉప్పల్, 418, పోలింగ్ కేంద్రాలు, 21 రౌండ్స్ కౌంటింగ్ టేబుల్స్,20, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్-02, ఈసారి పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారన్నారు. ఆ తర్వాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని తెలిపారు. ఈసారి ఐదు నియోజకవర్గాలకుగాను దాదాపు 9889, పోస్టల్ బ్యాలెట్లు వినియోగిచు కొన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.