సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానని ముందు వరుసలో నిలబడే నాయకుడు హరీష్ రావు అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగర వేస్తామని తెలిపారు.సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం కమ్మర్లపల్లి పలు గ్రామాల్లోని కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నట్లు తెలియజేశారు. ప్రజలందరూ కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హరీష్ రావుకు లక్ష యాభై వేల మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు .రాష్ట్రంలోని రైతులందరికీ సాగునీరు త్రాగునీరుకు ఇబ్బందులు లేకుండా అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్టు తెలియజేశారు .పార్టీకి ప్రజల ఆదరణ ఎంతో ఉన్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు .ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓట్లను విజ్ఞప్తి చేశారు.సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు అండదండలు ఉన్నట్లు తెలిపారు. హరీష్ రావు గెలుపు ఎప్పుడు ఖాయం అయిపోయినట్లు తెలిపారు .మంత్రి హరీష్ రావుకు భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని తెలియజేశారు . ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతు అవుతాయి.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండం వనిత రవీందర్ రెడ్డి ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు సర్పంచ్ ఎల్లయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.