కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

  • కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు
  • నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా
  • బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి
  • మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు
  • కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన
  • బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. కరీంనగర్‌ ‌పట్టణానికి అర పైసా పని కూడా చేయని బండి సంజయ్‌పై కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలువాలని కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. కరీంనగర్‌ ‌జిల్లాలో రూ. 1,067 కోట్లతో వివిధ పనులకు కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ ‌ప్రసంగించారు.మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని బండికి సవాల్‌ ‌విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏం అభివృద్ధి చేసింది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ •దా కోసం బండి సంజయ్‌ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్‌కు ఏ రాదని ఎద్దేవాచేశారు. కరీంనగర్‌కు కనీసం ఓ గుడి అయినా తెచ్చావా అని ప్రశ్నించారు. మూడేళ్లలో మతం పిచ్చి కడుపు నింపదని, బండి సంజయ్‌ ‌యువతను చెడగొడుతున్నారని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు.

కరీంనగర్‌ను ఒక లక్ష్మీనగరంగా సీఎం చూస్తారు. ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని కేసీఆర్‌ ‌నమ్ముతారు. మే 17, 2001న సింహగర్జన సభ పెట్టి తెలంగాణ సాధనకు నాంది పలికారు. తెలంగాణ వచ్చింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్‌ ఉం‌డే. ఇప్పుడు ఆసరా పెన్షన్ల కింద రూ. 2016లు ఇస్తున్నాం. ఆసరా పెన్షన్లు పెద్ద మనషుల్లో ఆత్మగౌరవం తీసుకొచ్చింది. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది మాత్రమే. భర్తల చేత నిరాదరణకు గురైన మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు రూ. 3,016 ఇస్తున్నాం. కులం, మతంతో సంబంధం లేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌పథకాలు అమలు చేసి లక్షా నూట పదహారులు ఇస్తున్నామని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కరీంనగర్‌ ‌జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ కేటాయించాం. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతున్నది అని కేటీఆర్‌ ‌తెలిపారు. రూ. 1067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కరీంనగర్‌కు ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండేది. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. 50 వేల కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తామన్నారు. కరీంనగర్‌ ఎల్‌ఎం‌డీ వద్ద అద్భుతమైన తీగల వంతెనను నిర్మించారు. రూ. 410 కోట్లతో సదాశివపల్లి దాకా మానేరు రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్‌ ‌కుమార్‌ ఎం‌పీగా ఉన్న సమయంలో స్మార్ట్ ‌సిటీ స్టేటస్‌ ‌కరీంనగర్‌కు వచ్చింది. బండి సంజయ్‌ ‌గెలిచి మూడేండ్లు అయింది. కనీసం కరీంనగర్‌ ‌పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు. దమ్ముంటే చెప్పాలి. కరీంనగర్‌కే కాదు.. సిరిసిల్ల నేతన్నలకు పవర్‌ ‌లూమ్‌ ‌కస్టర్‌ ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. చొప్పదండికి కూడా ఏం చేయలేదు. కాళేశ్వరం ద్వారా పూర్వ కరీంనగర్‌ ‌జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ •దా ఇప్పియ్యలేదు. ఆ ప్రాజెక్టుకు జాతీయ •దా ఇవ్వాలని కనీసం పార్లమెంట్‌లో కూడా మాట్లాడలేదని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కరీంనగర్‌కు మెడికల్‌ ‌కాలేజీ కేటాయించిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఒక మెడికల్‌ ‌కాలేజీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ రాలేదు. చివరకు పాలిటెక్నిక్‌ ‌కాలేజీ కూడా తేలేదు.

పొద్దున్నే లేస్తే హిందూ ముస్లిం అంటారు. ఒక గుడి కూడా తేలేదు. ఏం చేతకాదు. కేసీఆర్‌ను తిట్టడం, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్‌ ‌ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. చేనేత సముహాలు, బ్లాక్‌ ‌లెవల్‌ ‌క్లస్టర్‌ ఇవ్వాలని కోరితే కూడా తెప్పించలేదు. కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో అర పైసా పని కూడా చేయలేదు. బూతులు తిట్టడం తప్ప మంచి చేసిందే లేదన్నారు. పిల్లల భవిష్యత్‌కు పనికొచ్చే పనికి ఒకటి కూడా చేయలేదు. పనికిమాలిన మాటలతో కడుపు నిండదు. మతం అనే పిచ్చి కడుపు నింపదు. భారతదేశానికి బువ్వ పెట్టే మొదటి నాలుగు రాష్టాల్ల్రోతెలంగాణ ఉంది. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. బండి బాగా మాట్లాడుతున్నావ్‌.. ‌దమ్ముంటే గంగుల ద పోటీ చేసి గెలువాలని సవాల్‌ ‌విసురుతున్నా. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page