పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం జిన్నారం మండల తహసిల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది తదితరులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయల చెక్కులు, గతంలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన 30 మంది బాధితులకు మంజూరైన 96 వేల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, బొల్లారం మున్సిపల్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, ఆయా గ్రామాలు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.