ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 2; మెయినాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం కార్మికులకు తెలిపారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అని వసంతం అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు పచ్చదనం పెరగడానికి గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమ ఎంతో ఉందని అయినప్పటికీ ప్రభుత్వం వారి శ్రమను గుర్తించడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్,సిఐటియు మొయినాబాద్ మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్, గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,గ్రామపంచాయతీ మండల నాయకులు కృష్ణ,సుధాకర్,మహిళా నాయకురాలు ప్రమీల,లక్ష్మి,గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.