కిమ్స్ ‌దవాఖానాలో అరుదైన చికిత్స

హైదరాబాద్‌, ‌సెస్టెంబర్‌ 13 : ‌పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ ‌బాలిక (9)కు సికిం ద్రాబాద్‌ ‌కిమ్స్ ‌దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పి ంచారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ ‌డోర్సల్‌ ‌కైఫోసిస్‌’‌గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరి ంచారు.

వెన్నెము కలోని ఎముకలు అసం పూ ర్తిగా ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తిన ట్టు వైద్య పరీక్షల్లో తేలిందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆ బాలికకు పక్షవాతం వచ్చే ముప్పు ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్డియా లజి స్టులు, పల్మనా లజిస్ట్‌ల అభిప్రాయాలను తీసు కుని దాదాపు 6 గంటల పాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిం దని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగం గా ఇంట్రా ఆపరేటివ్‌ ‌న్యూరో మానిటరిం గ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రోగి త్వరగా కోలుకోగలిగేలే చేసినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page