•ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి•అమెరికాలోని కిళ్ళై స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వరణ్యలక్ష్మి విద్యాభ్యాసం•మాతృదేశ కళల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న వరణ్యలక్ష్మి
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి జ్వాలా నరసింహారావు మనవరాలు మేధా వరణ్యలక్ష్మి కూచిపూడి నృత్యంతో రవీంద్రభారతిలో అలరించారు. నృత్యకారిణిని వరణ్యలక్ష్మి అమెరికాలో ఉంటూ భారతదేశ సంప్రదాయ కళఅయిన కూచిపూడిని గురువు వేదాంతం రాఘవ శిక్షణలో సుశిక్తులై రవీంద్రభారతిలో అరంగేట్రాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సురభివాణి,
ప్రభుత్వ సలహా దారులు కెవి.రమణ చారి, సిని నటుడు తనికెళ్ళ భరణి పాల్గొని అభినందించారు. అమెరికాలోని కిళ్ళై స్కూల్ ఆఫ్ బిజినెస్ లో విద్యాభ్యాసం చేస్తూ మాతృదేశ కళల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని వారు కొనియాడారు. బాల్యం నుంచి అమెరికాలోని పాఠశాల, కళాశాలలో కూడా పలు ప్రదర్శనలు చేసి మెప్పు పొందడం జరిగిందని నృత్యకారిణి తల్లిదండ్రులు మంజుల కృష్ణ తెలిపారు.