కృష్ణాలో మా వాటా తేల్చండి

  • మా వాటా 575 టీఎంసీలు మాకు దక్కాల్సిందే
  • ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానామా…
  • తెలంగాణకు క్షమాపణలు చెప్పాకే కాలు  మోపాలి
  • రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారు
  • కించపరుస్తూ పదేపదే ప్రజలను అవమానిస్తున్నారు
  • గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు
  • తమిళి సై గవర్నర్‌ ‌పదవికి అర్హురాలు కాదు
  • బలహీనవర్గాల వారిని మండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బంది..?
  • మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌  

హైదరాబాద్‌. ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో కాలు పెట్టే నైతిక హక్కు కూడా లేదని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో వి•డియాతో మాట్లాడుతూ..తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ బీజేపీ అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. అక్టోబర్‌ 1‌వ తేదీన పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న మోదీపై కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. తెలంగాణ అమరుల త్యాగాలను కించపర్చిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి మహబూబ్‌నగర్‌ ‌రావాలని మంత్రి కేటీఆర్‌  అన్నారు.  పాలమూరు వలసల జిల్లా అనే నానుడి ఉంది.. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన పాలమూరు జిల్లాకు మోదీ ఏం చేయలేదని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. 2014 జూన్‌ 2‌న తెలంగాణ వస్తే జులై 14న ఓ లేఖ తీసుకుని వి• దరగ్గరకు కేసీఆర్‌ ‌వచ్చారు.

నీళ్లలో జరిగిన అన్యాయం గురించి మోదీకి వివరించారు. గోదావరి, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చాలని, అప్పుడే న్యాయబద్దమైన వాటా దక్కుతుందని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సహకరించండి, జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడ్డ పాలమూరు ఇప్పుడే పచ్చబడు తుంటే.. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ పగబట్టింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, మరోవైపు జాతీయ హోదా ఇవ్వలేదు. అప్పర్‌ ‌భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారు. పాలమూరు గడ్డ వి•ద కాలుపెట్టే ముందు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. కృష్ణా జలాల్లో వాటా తేల్చుతామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తున్నాము. ఒక్కో రాష్టాన్రికి ఒక్కో విధానాన్ని బిజెపి అవలంబిస్తుంది. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గతంలో బీజేపీ నాయకులు చెప్పారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు.

దీనికి విరు బాధ్యులు కాదా..? కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ట్రైబ్యునల్‌కు రెఫర్‌ ‌చేయడానికి ఎందుకు మనసు రావడం లేదు. ఒక్క మాట, ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..? నికృష్ట రాజకీయం ఎందుకు అని మోదీని కేటీఆర్‌ ‌నిలదీశారు. రాష్ట్రం వొచ్చిన 40 రోజులకే కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రానికి కేసీఆర్‌ ‌లేఖ రాశారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే ఏడాది వరకు వేచి చూశాం. ఆగస్టు 10, 2015నాడు సుప్రీమ్‌ ‌కోర్టును ప్రభుత్వం ఆశ్రయించి న్యాయపోరాటం చేసింది. 2020, అక్టోబర్‌ 6‌న అపెక్స్ ‌కౌన్సిల్‌లో కేంద్రాన్ని, జలవనరుల శాఖను కేసీఆర్‌ ‌గట్టిగా నిలదీశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని అడిగితే.. కేసు ఉపసంహరించుకోమని సూచించారు. కేసు విత్‌ ‌డ్రా చేసుకున్న తర్వాత.. ఈ రోజు వరకు కనీసం ఉత్తరం రాసిన పాపాన పోలేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడికి ఏపీకి బచావత్‌ ‌ట్రైబ్యునల్‌ ‌కేటాయించింది. 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. ట్రైబ్యునల్‌కు ఉత్తరం రాయకుండా పాలమూరులో ఎలా అడుగుతపెడుతారని ప్రశ్నించారు. మోదీ నిర్వాకం వల్ల నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు వందల టీఎంసీల నీటిని కోల్పోతున్నాయని కెటిఆర్‌ అన్నారు.

తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారు
ఇక పార్లమెంట్‌ అమృతకాల సమావేశాల్లో ప్రధాని మోదీ తెలంగాణపై ఎందుకు విషం చిమ్మారని మంత్రి కెటిఆర్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో సదేపదే విషం చిమ్ముతున్నారని కెటిఆర్‌ ‌మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ పదేపదే కించపరుస్తున్నారని, రాష్ట్రంపై పగబట్టినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని మాటిమాటికీ అంటున్నారని, కానీ కెసిఆర్‌ 14 ఏళ్ల పోరాటం తర్వాతనే తెలంగాణ వొచ్చిందని అన్నారు. తాను చేసిన వ్యాఖలకు ప్రధాని రాష్ట్ర ప్రజలకు తప్పకుండా వివరణ ఇవ్వాలని కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణపై రెండు జాతీయ పార్టీలు పగబట్టాయని కెటిఆర్‌ అన్నారు.

మోదీకి ఏజెంట్లుగా గవర్నర్లు
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ‌కోటాలో పంపిన రెండు అభ్యర్థిత్వాలను గవర్నర్‌ ‌తిరస్కరించడంపై కెటిఆర్‌ ‌స్పందిస్తూ…ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తులనే ఎంఎల్‌సీలుగా క్యాబినెట్‌ ‌సిఫార్సు చేసిందని, గవర్నర్‌ ‌మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నవారిని సిఫార్సు చేయవద్దని గవర్నర్‌ అన్నారని, ఆ నియమం ఆమెకు వర్తించదా అంటూ కెటిఆర్‌ ‌ప్రశ్నించారు. గవర్నర్‌ అయ్యే ముందు ఆమె తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నారని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారు గవర్నర్‌గా వ్యవహరించకూడదని సర్కారియా కమిషన్‌ ‌స్పష్టం చేసిందని కెటిఆర్‌ అన్నారు. గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీకో న్యాయం..మాకో న్యాయమా అంటూ కెటిఆర్‌ ఈ ‌సందర్భంగా ప్రశ్నించారు. గవర్నర్‌ ‌పదవికి తమిళి సై అర్హురాలు కాదని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు శాసనమండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బందని గవర్నర్‌ను మంత్రి కెటిఆర్‌ ‌ప్రశ్నించారు.

అసలు ఈ దేశంలో గవర్నర్‌ ‌పోస్టు అవసరమా..అంటూ మంత్రి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. గవర్నర్‌ ‌వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేయడం సరికాదన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, ‌బీజేపీకి ఒక నీతి..తమకొక నీతి అని, ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయని, కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌నాయకులను ఎమ్మెల్సీలుగా చేయడంలో అక్కడి బీజేపీ గవర్నర్‌ ‌సహకరిస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అర్హత లేని వారిని నామినేట్‌ ‌చేస్తారని, కానీ తెలంగాణ విషయానికి వొచ్చే సరికి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న శ్రవణ్‌, ‌సత్యనారాయణ అనర్హులు అయ్యారన్నారు. అర్హులెవరో..అనర్హులెవరో తాము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని కెటిఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page