రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ముంబై, జనవరి 14 : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సిటీలోగల గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం మూడుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాంతో గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న నాగ్‌పూర్ పోలీసులు వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని నాగ్‌పూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ మదానే చెప్పారు. నాగ్‌పూర్‌లోని ఖమ్లా చౌక్ ఏరియాలో నితిన్ గడ్కరీ కార్యాలయం ఉన్నది. ఆ కార్యాలయానికి, నితిన్ గడ్కరీ నివాసానికి మధ్య దూరం కేవలం ఒక కిలోటర్ మాత్రమే. కాగా, గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.