రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు
నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్, రాష్ట్రంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..గజ్వేల్ నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేసిన సిఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలోని అతి ఎక్కువ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గజ్వేల్‌కు రైల్వే స్టేషన్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేననీ, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు గజ్వేల్‌లో నిర్మాణం చేసుకున్నామనీ, దీంతో ఇప్పుడు ఎవరూ కూడా ప్రయివేట్ దవాఖానాలకు వెళ్లడం లేదన్నారు. ఇవాళ కూడవెళ్లి వాగు, హల్దీవాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయన్నారు. గతంలో నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారనీ, గజ్వేల్‌కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే తాను రాజీనామా చేస్తా అని కేసీఆర్ చెప్పారని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇచ్చి చూపారన్నారు. ఏ కార్యక్రమమైనా మొదట గజ్వేల్‌లో చేసి తరువాత రాష్ట్రం మొత్తం అమలు చేశారన్నారు. ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా తమ వోటు కారుకు, కేసీఆర్‌కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారనీ, రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దామన్నారు. గజ్వేల్‌లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వొస్తుందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభం చేయించుకున్నామనీ, అదే మిషన్ భగీరథ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశానికి రోల్ మోడల్ గజ్వేల్ నియోజకవర్గం అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పునరుద్ధరణ చేసిన అడవులు, మిషన్ భగీరథ కార్యక్రమం చూసేందుకు ఇవాళ దేశంలో అనేక మంది ఇక్కడకు వొస్తున్నారనీ, ఇవాళ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నామనీ, 3500కోట్ల రూపాయల వడ్లు పండిస్తున్నారనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.