కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

  • సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది
  • బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌

జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.గాజులమ్మే పూసలు, సంచార జాతుల ఇంటింటికి తిరిగి కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌చేస్తున్న అన్యాయాన్ని వివరించి టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ను గద్దె దించాలన్నారు.ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా చీటకోడూర్‌ ‌గ్రామంలోకి శుక్రవారం ప్రవేశించిన బండి సంజయ్‌కు స్ధానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.మహిళలు భోనాలతో, కోలాటాలతో, డప్పు వాయిద్యాల నడుమ కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి.గ్రామపంచాయతీ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.భగత్‌ ‌సింగ్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం సంచార జాతులతో కలిసి రచ్చబండ నిర్వహించిన సంజయ్‌ ‌వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు.తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించుకునే స్తోమత లేదని, ఉన్నత విద్యను అందించడం అసాద్యంగా మారిందని, 200 సంవత్సరాలుగా సంచార జాతులు ఎన్నో సమస్యతో సతమతమవుతున్నామన్నారు.తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్నామని కానీ ఇప్పటికి ఎలాంటి న్యాయం జర్గలేదన్నారు.

తెలంగాణ వచ్చాక తమ బతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని, సంచార జాతులకు కేంద్రం, రాష్ట్రం నుండి వచ్చే పధకాలకు అర్హత లేకుండా చేశారన్నారు.మేము బతకడమే భారంగా మారిందని వాపోయారు.మాకు మీరైనా న్యాయం చేయండని బండి సంజయ్‌ను వేడుకున్నారు.ఈసందర్బంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ మీ జీవితమంతా ఈ గంప మీద ఆధారపడి ఉంటుందని, సంచార జాతులు చాలా దుర్బరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు.నేను కూడా సంచారజాతి ప్రజల కష్టాలు తెల్సుకునేందుకు సంచారజాతి అవతారమెత్తానన్నారు.సీఎంకేసీఆర్‌ ‌బతుకును కూడా సంచార జాతి చేద్దామన్నారు.రాష్ట్రంలో సంచార జాతుల జనాభా 30 లక్షలు ఉన్నప్పటికి పాలకులకు మీపై దయలేదన్నారు.సీఎం కేసీఆర్‌కు బెల్టుషాపులు తప్ప మీ భాదలు పట్టవని, సంచారజాతుల 7కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నాయని ఇక్కడ మాత్రం లేవన్నారు.

యూపీలో సంచార జాతుల వారు గల్లిగల్లి తిరిగి బిజెపికి సపోర్టు చేసి గెలిపించారని, యూపీలో సంచారజాతులకు న్యాయం జరుగుతుందన్నారు.బీసీలను మోసం చేస్తున్న ద్రోహి కేసీఆర్‌ అన్నారు.ఎంబీసీ కార్పోరేషన్‌కు ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తానని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చాడని కానీ ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం రూ.67 కోట్లేనన్నారు.తెలంగానకు ప్రధానీ మోదీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశాడని వాటిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.కులవృత్తులను రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని, ఎన్నికలు లేవు, ఓట్ల కోసమో రాలేదు, మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చామన్నారు.బిజెపి ప్రభుత్వం రాగానే సంచార జాతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మూర్తినేని ధర్మారావు, బొడిగే శోభ, నాయకులు మహేందర్‌రెడ్డి, సౌడ రమేష్‌, ఉడుగుల రమేష్‌, ‌పవన్‌శర్మ, నాయకులు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page