ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు
ఉక్రెయిన్ యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ
న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతుంది. లీటర్ పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్ మిద 86 పైసలు పెంచారు. గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు చమురు ధరలు పెరగడం గమనార్హం. నాలుగు రోజుల్లో పెట్రో ధరలు దాదాపు 3 రూపాయల 20 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ.98.10కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.81గా, ముంబైలో రూ.112.51, కోల్‌కతాలో రూ.106.34, చెన్నైలో రూ.103.67, బెంగళూరులో రూ.103.11, జైపూర్‌లో రూ.109.73, లక్నోలో 97.67కి లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.24కి పెరిగాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.40, డీజిల్ ధర రూ.96.75గా ఉంది.
ఉక్రెయిన్ యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలను కేంద్రం పెంచుతుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రలు వాటిని తిప్పి కొడుతూ ఉక్రెయిన్ యుద్దం కారణంగానే ధరలు పెరిగాయని సమర్థించారు. తాజాగా మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు వేర్వేరుగా స్పందిస్తూ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంధన ధరల పెరుగుదలను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించారు. ఇది భారత ప్రభుత్వ పరిధిలో లేదని మంత్రి చెప్పారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు ఇంధన ధరలను పెంచడాన్ని నియంత్రించలేమన్నారు. ముంబైలో జరిగిన ఓ శిఖరాగ్ర సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.