ప్రజా‘తంత్రం’
ఎవరి బల సమీకరణం వారిది
కులజనుల కూడికే మూలనిధి
రాజకీయ లెక్కలకి ఇదే పునాది
ఎక్కాలు రాకపోతే ఒకటే రంధి
అంతరాలే అందలానికి పెన్నిధి
నిచ్చెనమెట్ల కిందకి నెట్టే పరిధి
సామాజిక న్యాయానికి సమాధి
ప్రజాస్వామ్యమే చివరికి బందీ!
– వి.రమేష్ బాబు
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బోధన్, నిజామాబాద్ (అర్బన్ ), ఎల్లారెడ్డి మరియు మెదక్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.’’ ఇక్కడ నియోజక వర్గం లో ఏ ఎమ్మెల్యే గెలిస్తే..హైదరాబాద్ లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తది.. ఆలోచించి వేయకుంటే వోటే కాటేసే అవకాశం ఉంటది.. తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పెట్టింది.. యాభై ఏండ్ల కాంగ్రెస్.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును బేరీజు వేయండి..
అని కేసీఆర్ వోటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బోధ్, నిర్మల్ మరియు జనగామ నియోజక వర్గ కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొన్నారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని రేవంత్ ఆరోపించారు. కొన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థి కి పోటీ గా నిలబడ్డ రెబెల్స్ ను బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది.