సైబరాబాద్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విూట్ ప్రారంభించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి
హైదరాబాద్, ప్రజాతంరత, ఫిబ్రవరి 1 : పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని, పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడ తాయని, క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని సైబరాబాద్ పోలీస్ కవిూషనర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కవిూషనరేట్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సైబరాబాద్ 6వ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విూట్-2024 గురువారం ఘనంగా ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కవిూషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్., మరియు జోనల్ డీసీపీలు కలిసి బెలూన్లు, పావురాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా సీపీ వివిధ జోన్ ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. ముందుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో పాల్గొంటున్న సిబ్బందిని అభినందించారు. పోలీసు సిబ్బంది అందరూ తప్పకుండా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో పాల్గొనాలని కోరారు. సీనియర్ ఆఫీసర్లు కూడా ఏదైన ఒక ఈవెంట్లో పాల్గొని స్పోర్ట్స్ విూట్ను విజయవంతం చేయాలని కోరారు.
పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం, మానసికోల్లాసం కోసం ప్రతీ సంవత్సరం యాన్యువల్ స్పోర్ట్స్ విూట్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసు సిబ్బంది ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విూట్ ను తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వారి టీమ్ లను ఉత్సాహపరచాలన్నారు. సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షవిూర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 1బబి,2నిట,3సట మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో వివిధ జోన్ల మరియు వింగ్స్ చెందిన పోలీసు క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొంటున్నారన్నారు. పోలీసులు క్రీడల్లో పాల్గొనాలని కోరారు. నిత్య జీవితంలోనూ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. 1000 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ ఈవెంట్స్ లో పాల్గొననున్నారు ఇందులో 150 మందికి పైగా విమెన్ స్టాఫ్ పాల్గొంటు న్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ తో పాటు సైబరాబాద్ డీసీపీ కైమ్స్ర్ నర్సింహా కొత్తపల్లి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి.వినీత్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఐపీఎస్., మేడ్చల్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., డీసీపీ అడ్మిన్ రవి చందన్ రెడ్డి, ఎలెక్షన్ సెల్ డీసీపీ అశోక్, సైబర్ కైమ్స్ర్ డీసీపీ కె. శిల్పవల్లి, ఎస్ఓటి డీసీపీ రషీద్, విమన్ / చైల్డ్ సేప్టీ డీసీపీ సృజనా కర్ణం, రాజేంద్రనగర్ ఏడీసీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షవిూర్, సిఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఏడీసీపీ కైమ్స్ర్ జి.నరసింహా రెడ్డి, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, సీఏఓ అడ్మిన్ గీత, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది, పోలీసు సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.