సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గ తిగుల్ గ్రామానికి బిజెపి సీనియర్ నాయకుడు కప్పర ప్రసాద్ రావు కెసిఆర్ పై పోటీకి సిద్ధం అంటున్నారు. 30 సంవత్సరాల కిందట ఎబివిపి విద్యార్థి గా గజ్వేల్ లో తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన జర్నలిస్టుగా సుధీర్ఘ కాలం
పని చేస్తున్నా… బిజేపి కీలక నేతలతో సన్నిహితంగా ఉంటూ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తన అభ్యర్థిత్వాన్ని బిజేపి రాష్ట్ర పార్టీ ఆఫీసులో బిజెపి రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డికి బుధవారందరఖాస్తు సమర్పించిన ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో గజ్వేల్ లోనే అత్యంత అవినీతి పాలన జరుగుతుందని గజ్వేల్ లో నాయకులు అందుబాటులో లేక ప్రజల సమస్యలు పట్టించుకున్న నాథుడు లేడన్నారు. దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్ , మల్లన్న సాగర్ లో కొండపోచమ్మ సాగర్ ఇల్లు కోల్పోయిన అనేక మంది కేసీఆర్ బాధితులు గజ్వేల్ లోనే ఎక్కువ ఉన్నారని అన్నారు. గజ్వేల్ ప్రజలకు ఆయన చేసింది మొత్తం అన్యాయమే అని రోడ్లు భవనాలు కడితే అభివృద్ధి కాదని డబుల్ బెడ్ రూమ్లు ఇల్లు ఇస్తానన్న హామీ పదేళ్లయిన నెరవేర్చని మోసకారి కేసీఆర్ పై కమలం పువ్వు అభ్యర్థిగా ఓడించడం సాధ్యమే అన్నారు.గజ్వేల్ లో కమలం జెండా ఎగరవేయడం ఖాయమని పేద ప్రజల పక్షాన బిజెపి తప్ప మరే పార్టీ పోరాటం చేయదని అన్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి బిజెపిలో సభ్యునిగా పనిచేస్తున్న తనకు బిజెపి జగదేవ్పూర్ మండల అధ్యక్షునిగా రెండు పర్యాయాలు అవకాశం పార్టీ ఇచ్చిందన్నారు.పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగాఅద్వానీ రామ రథయాత్ర,భారత్ సురక్ష యాత్రలలో చురుగ్గా పాల్గొన్న ఆయన. మురళీ మనోహర్ జోషి రథయాత్రలో పాల్గోన్నారు. బిజేపి పార్టీ విద్యాసాగర్ రావు నాయకత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ కమిటీకి రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తు ఒయూ ప్రజా సంఘాలను ఒకే వేధిక పైకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జేఏసీ లో కీలక భూమిక పోషించారు.
తెలంగాణ ఉద్యమ సంఘాలను బిజేపి పార్టీకి దగ్గర చేసేందుకు అనేక వేదికలకు నాయకత్వం వహించారు.ఎన్నికల సందర్భాల్లో పార్టీలో మేనిఫెస్టో కమిటీ, మీడియా కమిటీ, లిటరేచర్ కమిటీ లలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు.బండారు దత్తాత్రేయ వేములవాడ నుంచి నిర్వహించిన రథయాత్రలో గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జిగా విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారు.కిషన్ రెడ్డి నిర్వహించిన తెలంగాణ పోరు యాత్ర లో యాత్ర ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు అన్ని సందర్భాల్లో ముఖ్య భూమిక పోషించారు.ముషీరాబాద్, మహబూబ్ నగర్ , పరకాల ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అప్పగించిన బాధ్యతలను పూర్తి సమయం ఇచ్చి నిర్వహించారు.కిషన్ రెడ్డి నిర్వహించిన సింగరేణి యాత్ర లో మొత్తం రోజులు పాల్గొన్నారు.డాక్టర్ లక్ష్మణ్ నిర్వహించిన మార్పు కోసం బిజెపి యాత్రలోను, మూసి ప్రక్షాళన యాత్రలో ను, తెలంగాణ విమోచన దినం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేసీనఆయన నమామి మూసి అధ్యక్షునిగా మూసి ప్రక్షాళన కోసం అనేక ఉద్యమాలు రూపకల్పన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు.మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నరేంద్ర పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల్లో స్థానికంగా ఉంటూ అనేక వేదికల ఏర్పాటు చేశారు.మెదక్ జిల్లా టెలికం అడ్వైజరి బోర్డ్ సభ్యునిగా ఎన్నికయ్యారు.జగదేవపూర్ మండల కొండపోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా రెండు పర్యాయాలు విధులు నిర్వహించి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.బిజెపి మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆర్టీసీ సమ్మెలో నష్టపోయిన కార్మికుల పక్షాన గజ్వేల్ లో పోరాటాలు చేసి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో అనేక కార్యక్రమాలు చేపట్టారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన వారి పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉన్నారు.