పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 69 రోజుల హుండీ ఆదాయం 18,39,614( 18 లక్షల ముఫై తొమ్మిది వేల అరు వందల 14 రూపాయలు) అలాగే అన్నదానం హుండీ 1,04,336 / ఒక లక్ష నాలుగు వేల మూడు వందల 36 రూపాయలు వచ్చిందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.రంగారావు సమక్షంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీలో వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూర్చున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్, అర్చకులు సంతోష్ శర్మ, సతీష్ శర్మ, అజయ్ శర్మ, జగదీశ్ స్వామి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.